తాడేపల్లి: నగర పరిధిలోని మహానాడులో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు సోమవారం రాత్రి తాడేపల్లి పోలీసులు దాడులు చేశారు.
- ఈ దాడిలో 3. 5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని బియ్యాన్ని తరలించే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం అమ్మడం కొనడం నేరమని పోలీసులు తెలిపారు.