అడవుల పెంపకంలో భాగంగా అటవీ ప్రయోజనాల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా అడవిలో నియంత్రణ లేకుండా పెరుగుతూ ఇతర ప్రాంతాల నుండి పరిచయం చేయబడి దావానలంలా వ్యాపించే కలుపు మొక్కల తొలగింపు కోసం పని చేస్తుందా, ఆక్రమణ వృక్ష జాతుల తొలగింపు పని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వర్తింప చేయబడలేదనేది నిజం కాదా అలా అయితే, దాని వివరాలు మరియు కాకపోతే దానికి గల కారణాలు తెలుపగలరు అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి బదులిస్తూ ఇస్తూ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది డిమాండ్ ఆధారిత వేతన ఉపాధి కార్యక్రమం ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి డిమాండ్‌కు అనుగుణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల కంటే తక్కువ కాకుండా నైపుణ్యం లేని మాన్యువల్ పనిని హామీతో కూడిన ఉపాధిగా అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. దీని ఫలితంగా నిర్ణీత నాణ్యత మరియు మన్నికతో ఉత్పాదక ఆస్తులను సృష్టించడం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం షెడ్యూల్ – 1 లోని పారా 4(1) ప్రకారం సాధారణ, అటవీ భూములు, రోడ్డు మార్జిన్లు, కాలువ గట్లు, ట్యాంకుల షోర్లు, తీరప్రాంతాలలో అడవుల పెంపకం, చెట్ల పెంపకం మరియు ఉద్యానవనాలు అభివృద్ధి చేయడం వంటివి అనుమతించదగిన కార్యకలాపాలని చెప్పారు. ఈ చట్టంలోని షెడ్యూల్ -1 లోని పేరా 4(3) ప్రకారం గడ్డి, గులకరాళ్లు తొలగించడం, వ్యవసాయ కార్యకలాపాలను అంచనా వేయలేని, పునరావృతమయ్యే పనులు చేపట్టబడవని దీని ప్రకారం కలుపు మొక్కల తొలగింపు, ఆక్రమణ వృక్ష జాతుల తొలగింపు పనులు ఈ పథకం కింద అనుమతించబడవు అని తెలియజేసారు.
స్థానికేతర వృక్ష జాతులు నియంత్రణ లేకుండా వ్యాపించే ధోరణిని చూపుతాయని సాధారణంగా ఇతర ప్రాంతాల నుండి పరిచయం చేయబడి కొత్త ప్రాంతాలలో దావానలంలా వ్యాపించే ఈ ఆక్రమణ జాతుల మొక్కలు పర్యావరణ హానిని కలిగిస్థాయిని లేదా మానవ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని ఆయన చెప్పారు. నీరు, కాంతి, పోషకాలు, స్థలం ఎక్కువగా తీసుకొని స్థానికంగా అడవులలో పెరిగే సాధారణ మొక్కల క్షీణతకు ఇవి కారణమవుతాయని అలాగే వన్యప్రాణుల ఆవాసాలను మరియు నీటి నాణ్యతను క్షీణింపజేస్తాయని తద్వారా పర్యావరణ హాని కలుగజేస్తాయని ఎంపీ గురుమూర్తి గారు చెప్పారు. ఇందు కోసంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.