అత్యవసర చికిత్స అందించిన గవర్నర్..

0
3

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విమానంలో ఓ వ్యక్తికి అత్యవసర చికిత్స అందించారు. దిల్లీ – హైదరాబాద్ ఇండిగో విమానంలో అస్వస్థకు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేశారు. వారణాసి వెళ్లిన గవర్నర్ శుక్రవారం అర్ధరాత్రి దిల్లీ – హైదరాబాద్ ఇండిగో విమానంలో తెలంగాణకు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణ సమయంలో ఒక వ్యక్తి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులున్నారా?అని అడగడంతో తమిళిసై స్పందించారు. వెంటనే అస్వస్థతకు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ఉపశమనం కలిగించారు. ప్రాథమిక చికిత్సతో కోలుకున్న వ్యక్తి సహా ఇతర ప్రయాణికులు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని తమిళిసై అభినందించారు. విమానంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విమాన ప్రయాణాల్లో వైద్యులు ఎవరైనా ఉంటే ముందే వారి వివరాలను అందుబాటులో ఉంచే విధంగా ఒక విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు విమాన సిబ్బందికి సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తే బాగుంటుందన్నారు. సిబ్బందితో పాటు సామాన్యులు కూడా సీపీఆర్ చేసే విధానంపై శిక్షణ తీసుకుంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here