అదాన్ డిస్టిలరీకి ఆ 10రూ..కోట్లు ఎవరిచ్చారు..?

0
6

పొట్టి సారాయి పింక్ డైమండ్ రెడ్డి లేదా హాఫ్ టిక్కెట్? లేదా ఇద్దరూ కలిసి ఇచ్చారా?
75శాతం మద్యం మీది కాదా?

 • టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి
  ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ….
  టీడీపీ ఒత్తిడితో ఆదాన్ డిస్టిలరీల డైరెక్టర్లు మార్పు:
  ఆదాన్ డిస్టిలరీస్ 2019 డిసెంబర్ 02న ప్రారంభమై, సుమారు రూ.2,400కోట్లు వ్యాపారం టర్నోవర్ చేశారు…నేడు ఇది రూ.3,000కోట్లు దాటినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఈ కంపెనీ మొదలుపెట్టినప్పుడు దీనికి డైరెక్టర్లుగా పిన్నాక.రోహిత్ రెడ్డి(పొట్టి సారాయిరెడ్డి అల్లుడు)ముప్పిడి అనిరుధ్ రెడ్డి(వైఎస్.భారతి, జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులు).ఈ విషయాలను గతంలో బయటపెట్టాం. దీంతో డైరెక్టర్లను మార్చేశారు. శ్రీనివాస్.కాశిచాయానుల, బోలారం.శివకుమార్ అనే పేర్లు డైరెక్టర్ లిస్టులోకి వచ్చాయి. వీళ్లు విజయసాయిరెడ్డి, భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇళ్లలో డ్రైవర్లా, వంటోళ్లా లేక మరెవరా అనేది ఇప్పటి వరకు వెతికినా దొరకలేదు. వీళ్ల ప్రొఫైల్ ఎక్కడా దొరకలేదు. ఏ1, ఏ2 లబినామీలే అని స్పష్టం చేస్తున్నాం. ఇటీవలె విజయసాయిరెడ్డి తన ప్రెస్ మీట్లో వాళ్లు ఎవరో తెలియదు అన్నాడు.
  రూ.10.60కోట్లు నీవేగా పొట్టిసారాయి రెడ్డి?
  నువ్వు డైరెక్టర్లుగా నియమించిన వారు కూడా నీకు గుర్తులేదా విజయసాయిరెడ్డి? ఆదాన్ డిస్టిలరీస్ ఆడిట్ రిపోర్ట్ లో రూ.10.60కోట్లు ఈ కంపెనీకి హ్యాండ్ లోన్ ఇచ్చారు…ఎవరిచ్చారు? మీరు కాదా? ఇది అన్ సెక్యూర్డ్ లోన్. ఇవి తమరి డబ్బులే కదా విజయసాయిరెడ్డి. నువ్వు దొంగ డైరెక్టర్లుగా నీ ఇంటి కూలివాళ్లను పెట్టి ఆదాన్ డిస్టిలరీలను నడిపిస్తున్నావు.
  1,100అడుగుల విస్తీర్ణ స్థలంలో రూ.3వేలకోట్ల కంపెనీ ఎలా సాధ్యం పొట్టిరెడ్డి?
  రూ.3,000కోట్ల టర్నోవర్ కంపెనీకి లీజు అగ్రిమెంట్ ప్రకారం కేవలం 1,100 అడుగుల విస్తీర్ణం గల కార్యాలయమా హైదరాబాద్ లో? హ్యాండ్ లోన్ కు సంబంధించిన ఆడిట్ రిపోర్టు, ఆఫీసు లీజు అగ్రిమెంట్లు ఇవిగో. విజయసారాయిరెడ్డి…నీకు, మీ ముఖ్యమంత్రికి గతంలో చెప్పాం..మీ మందు తాగి ప్రజలకు మెదడు చెడిపోతోంది అని…నీకు, మీ ముఖ్యమంత్రికి మెదడు లేదు కాబట్టి అర్థం కాలేదు..విషపు మద్యాన్ని అమ్ముతున్నారు..
  పాలకు, మద్యానికి పోలిక తెలియదా తిక్కనాయాలా?
  పాలకు, మందుకు తేడా తెలియదా? తిక్కనాయాలా…మీకు చదువుచెప్పింది ఎవడ్రా?చిన్నపిల్లలు తాగేది, కాఫీ కాచుకునేది పాలు..దేనికి, దేనికి పోల్చాలో తెలియదా? నీకు ఎంపీ సీటు ఎవ్రడా ఇచ్చింది? మా నాయకుడిని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మీ ముఖ్యమంత్రిని అలాగే మాట్లాడాల్సి వస్తుంది.. ఏ బ్రాండ్ కూడా మేం ఇవ్వలేదని విజయసాయిరెడ్డి తన ప్రెస్ మీట్లో పేర్కొన్నాడు అన్నారు. అదేవిధంగా చంద్రబాబునాయుడుగారిని ఉద్దేశించి మద్యం బ్రాండ్లను చంద్రు ఇచ్చారు అని పెట్టారు.
  106కొత్త బ్రాండ్లు మీరు తెచ్చినవి కాదా పొట్టోడా?
  106 బ్రాండ్లను 2019 అక్టోబర్ నుండి 2020 ఫిబ్రవరి మధ్య మీరు తెచ్చారు…ఆర్.టి.ఐ నుండి మీ శాఖ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చెబుతున్నాను..దీనికేం సమాధానం చెబుతావు పొట్టి విజయసారాయిరెడ్డి? కాదంటే ఛాలెంజ్ కి రావాలి..2020ఫిబ్రవరి తర్వాత మరికొన్ని బ్రాండ్లను మీరు తెచ్చారు. శ్రీనివాస్ కాశిఛాయానుల, శివకుమార్ ఎవరో నీకు తెలియదన్నావు..అంత కొవ్వెక్కిందా?మీ ఇంట్లో పనిచేసేవాళ్లు నీకు తెలియదా? రూ.50వేలు పెట్టుబడిపెట్టి, రెండేళ్లలో దాని ఆదాయాన్ని రూ.2,500కోట్ల లాభాల్లోకి తీసుకెళ్లావంటే నువ్వు మామూలోడివి కాదు విజయసాయిరెడ్డి..
  నాకూ ఓ కంపెనీ పెట్టించు సారాయిరెడ్డి……
  నేను కూడా రూ.50వేలు, లేదా ఒక లక్ష రూపాయలు ఇస్తాను నాకు కూడా ఒక కంపెనీ పెట్టించాలి…నేను కష్టాల్లో ఉన్నాను. నాకు కూడా రూ.3వేలు నుండి రూ.4వేలు కోట్లు టర్నోవర్ చేయండి..మీరు దొంగలు గనుక దొంగ చేష్టలకు దిగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బులు కూడబెట్టకుంటున్నారు. మద్యపాన నిషేధం అని చెబుతున్న జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చెబుతున్నారు. 2022 మార్చి నాటికి రూ.24వేల కోట్ల విలువగల మందు అమ్మారు రజని అక్క… మద్యపాన నిషేధంపై చెప్పిన మాటలు ఏమయ్యాయి? టీడీపీ పాలనలో రూ.20వేల కోట్లు మద్యాన్ని మాత్రమే అమ్మాం…మీకు ఇంకా రెండేళ్లు ఉండగానే మమ్మల్ని దాటేశారు…మరో 25వేల కోట్ల మద్యాన్ని మీరు అమ్ముతారు..ఆదాన్ డిస్టిలరీస్ వంటి కంపెనీలు మరికొన్ని ఉన్నాయి..కేవలం ఇది ఒక్కటే బయటకు వచ్చింది..మిగిలినవి బయటకు రావాల్సి ఉంది..
  75శాతం మందు విజయసారాయిరెడ్డి, జగన్ రెడ్డిదే…..
  ఏపీ బేవరేజస్ ద్వరా బయటకు వెళ్లే మందు 75శాతం వీళ్లదే. కేవలం 3శాతం అంటే నమ్మడానికి మేం చెవుల్లో క్యాలీఫ్లవర్స్ పెట్టుకున్నాం అనుకున్నావా విజయసాయిరెడ్డి? ఏపీ బేవరేజస్ ఫోరెన్సిక్ ఆడిట్ కి మీరు సిద్దమా? టీడీపీ హయాంలో ఆఫీసర్స్ ఛాయిస్, మెక్ డొవెల్డ్, మాన్షన్ హౌస్, బ్యాగ్ పైపర్, హైవార్డ్స్ అధికంగా అమ్మిన బ్రాండ్లు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అదాన్ విస్కీ, ఆంధ్రాగోల్డ్, 9సీ హార్సెస్, ప్రెసిడెంట్ మెడల్, సిల్వర్ స్ట్రైప్స్ మీ హయాంలో అధికంగా అమ్ముడవుతున్నాయి…చంద్రబాబుగారి హయాంలో అమ్మిన బ్రాండ్లు నేడు ఏమయ్యాయో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి…మీ ఇంట్లో పనిచేసే కూలీలు, డ్రైవర్లు అమ్మే బ్రాండ్లను రాష్ట్ర ప్రజలపై రుద్దుతారా? ఆదాన్ విస్కీ క్వార్టర్ బాటిల్ ని రూ.36కి ప్రభుత్వం కొని రూ.200కి అమ్ముతున్నారు…విషపూరిత మందును రూ.36కే తయారు చేస్తున్నారు…దీనివల్ల ఆరోగ్యాలు చెడిపోక ఏముంటుంది? అసలు తయారుచేసేవాడు రూ.10కే మందును తయారుచేస్తున్నారు…
  వీళ్లు అమ్మేది మద్యం కాదు…విషం తాగకండి:
  ఇటువంటి దానిలో విషరసాయనాలు ఉంటాయి, దీన్ని తాగొద్దని ప్రజలకు మనవి….ఇటీవలె ఇద్దరు చనిపోయారు..వైఎస్ కుటుంబం చేతుల్లోకే రాష్ట్రంలో అమ్మే మద్యం వెళ్లిపోయింది…భారతదేశంలో ఉండే బ్రాండ్లలో ఒక్క బ్రాండ్ కూడా ఏపీలో కనిపించడం లేదు. అసలు న్యాయం ఉందా వీళ్లకు? ప్రభుత్వానికి సిగ్గు ఉంటే బోలారం శ్రీనివాసులు, శ్రీనివాస్ కాశిచాయానుల ప్రెస్ మీట్ పెట్టి తాము ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక కంపెనీకి రూ.10కోట్లు హ్యాండ్ లోన్ ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. విజయసాయిరెడ్డి వీటికి సమాధానం చెప్పాలి. ఏపీలోని కల్తీ బ్రాండ్లపై మూడు నెలలుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
  మీ ధనదాహానికి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు?
  మీ డబ్బుల కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా? ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది సరికాదు. టీడీపీ నుండి ఇప్పటి వరకు అమ్ముతున్న మద్యంపై ఇండిపెండెంట్ విచారణకు మీరు సిద్ధమా? ఎవరు తప్పు చేస్తే వారు జైలుకు వెళతారు. మేధావిగా నటించే సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. మీరు సిద్ధం అంటే కోర్టులో కేసు వేసేందుకు ముందుకు రావాలి. బోలారం.శ్రీనివాసులు, శ్రీనివాస్ కాశిచాయానుల ఎవరు అనే వివరాలు, సమాచారం ఏమైనా ఉంటే టీడీపీ జాతీయ కార్యాలయానికి తెలియజేయాలని ప్రజలకు మనవి. టీడీపీ హయాంలో అమ్మిన మద్యం బ్రాండ్లు అంతర్జాతీయంగా కంపెనీలు ఉన్నాయి..వైసీపీ వాళ్లు ధన దాహంతో సొంత బ్రాండ్లు తయారుచేసి ప్రజల ప్రాణాలు తీస్తూ సొమ్ములు కూడబెట్టకుంటున్నారు. ఇంకా ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వం కళ్లు తెరచి, విషపూరిత మద్యాన్ని అమ్మడం ఆపుతారు?
  శ్రీలంకను మించి అప్పులు జగన్ రెడ్డికే సాధ్యం:
  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలపై అప్పులు తేలేదు..కానీ జగన్ రెడ్డి తెచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితులపై ఆర్.బీ.ఐ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో రెండేళ్లు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత బెంగళూరు ప్యాలెస్ లో ఉంటారో, తాడేల్లి ప్యాలెస్ లో ఉంటారో, మరెక్కడైనా ఉంటారో తెలియదు. కానీ రాష్ట్రాన్ని అప్పుల్లో వదిలేస్తే తర్వాత వచ్చే టీడీపీ ప్రభుత్వమే ఈ అప్పులు తీర్చాల్సి ఉంటుంది.
  అప్పుల నుండి ఏపీని కేంద్రం కాపాడాలి:
  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి కూడా ఏపీని అప్పులభారీ నుండి కాపాడాలని కోరుకుంటున్నాం. చదువుకునే పాఠశాలలను మూసివేస్తున్నాడు..మద్యం షాపుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు ఇక్కడే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది. మీరు సీఐడీని వాడినా, దాడులు చేసినా మా ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగసిపడుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. మీరు ఎంత మర్యాదగా నడుచుకుంటే మేం అంత మర్యాదగా నడుచుకుంటాం. విజయసాయిరెడ్డి తాను చంద్రబాబుగారి బంధువునని చెప్పుకుంటున్నాడు, దీన్ని ఆపాలి. సారాయి వ్యాపారం చేసుకునేవాళ్లకు చంద్రబాబుగారు బంధువులు కాలేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here