గనుల శాఖ మంత్రి, అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్ధాయిలో ప్రశంసలు, గుర్తింపు. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి ఖనిజ వికాస్ అవార్డు
ఇటీవల ఢిల్లీలో మైన్స్ అండ్ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు అందుకున్న గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి
ఖనిజ వికాస్ అవార్డు క్రింద కేంద్ర గనుల శాఖ అందజేసిన రూ. 2.40 కోట్లు ప్రోత్సాహక చెక్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి చూపిన గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, డెరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి.