అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి పిలుపు..

0
8

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది.. ఈ నెల 6న హస్తినకు వెళ్లబోతున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ సమావేశం జరగనుంది.. అందులో బాబు పాల్గొననున్నారు. కేంద్రంఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి వెళుతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

అంతేకాదు జులై 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి చంద్రబాబుకు పిలుపు వచ్చింది. ఈ మేరవకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి బాబుకు లేఖ రాశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆహ్వాన లేఖ రాయడంతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసి పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని కేంద్రమంత్రి కోరారు.

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జులై 4న ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహం ఆవిష్కరిచారు. అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 34వ వార్డు ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని మున్సిపల్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here