అమరావతి రాజధాని విషయం లో BJP కి మరో మాట లేదు…

0
7

-కన్నా లక్ష్మి నారాయణ

రైతుల త్యాగాలు వృధా కావు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ అన్నారు.ఎస్.సి మోర్చా ప్రశిక్షణ రాష్ట్ర సదస్సు లో ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగించారు.బీజేపీ సహకారం తోనే రాజధాని కల సాకారం అయ్యిందని అన్నారు. ఎన్నో కేంద్ర సంస్థలు,రోడ్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. అమరావతిని దృష్టిలో పెట్టుకొనే కేంద్రం సహకరించింది అన్నారు. విభజన చట్టంలో వివిధ అంశాలు పరిశీలన చేయమని చెబితే ఆచరణ లోకి తీసుకొచ్చిన ఘనత బీజేపీ దే! అన్నారు.వివిధ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ దే అన్నారు.చంద్రబాబు మోడీ గారి ని దూషించడం వల్లే పరాజయం పాలయ్యాడ న్నారు.జగన్ పాదయాత్ర చేసి జనాల్ని నమ్మించాడని.. మేకల మధ్య వున్న పులి అదను చూసి మేకల్ని బలి తీసుకున్నట్టు.. జగన్ జనాల మధ్య తిరుగుతూ ఇప్పుడు జనాలను బలి తీసుకుంటున్నాడని అన్నాడు.జగన్ ఇచ్చే పధకాల కంటే మోడీ ఇస్తున్న పధకాలు ఎక్కువని కన్నా అన్నారు.
ఇసుక, మద్యం, మైనింగ్ వంటి వాటి వల్ల వచ్చే ఆదాయం క్రైంకర్యం జగన్ చేస్తున్నాడని అన్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం జగన్ ఖాతా లోకి వెళ్తుందని అన్నారు. మైనింగ్ ఆదాయం 70%.. జగన్ కే వెళ్తుందని అన్నారు. జగన్ ఇగోయిస్టు, పాసిస్టు అన్నారు. సొంత తల్లిని కూడా మోసం చేశాడని, చెల్లి కి తండ్రి ఆదాయం ఇవ్వాల్సి వస్తుందని జగన్ తరిమి వేశాడు అన్నారు. భారత దేశం లో ఎవరూ చేయనంత అవినీతి జగన్ చేశాడని అన్నారు.దళితులకు కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసిన నీచ చరిత్ర జగన్ ది అన్నారు.ఎస్ కార్పొరేషన్ ని గుల్ల చేశాడని అన్నారు.కేంద్రం ఇచ్చిన ఇళ్లు పూర్తి చేయలేదు అన్నారు.గతం లో పూర్తి చేసిన ఇళ్ళు కూడా పంపిణీ చేయలేదు అన్నారు.జగన్ ఇచ్చిన స్థలాలు ఒక స్కీమ్ అన్నారు. తక్కువ రేటు కి స్థలం సేకరించి ఎక్కువ రేటు కొని స్థానిక శాసన సభ్యులు, సీయం దోచుకున్నారని అన్నారు. మూడేళ్ల లో జగన్ చేసింది ఏమీ లేదన్నారు. ఒక్క పరిశ్రమ రాలేదు అని, వున్న పరిశ్రమలు కూడా వెళ్లి పొయాయి అన్నారు.రోడ్ల పరిస్థితులు అద్వానం అన్నారు. శాసన సభ్యుల భూకబ్జాలు పెరిగి పోయాయి అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాసులు జగన్ మనుషులను చూసి బెదిరిపోతున్నారని అన్నారు. టీచర్స్ మీద కోపం తో స్కూళ్లు విలీనం చేశాడని అన్నారు.విద్యుత్, బస్సు చార్జీ లు పెంచాడని అన్నారు. తెచ్చిన అప్పులు కూడా ఏమై పొయ్యాయో అర్థం కావడం లేదు అన్నారు. బటన్ నొక్కడానికి సీయం అవసరం లేదన్నారు. దేశం లో రిఛస్ట్ మ్యాన్ కావాలి అన్నది జగన్ లక్ష్యం అన్నారు.అందుకే తన దోపిడీ నిరాఘటం గా కొనసాగిస్తున్నారని అన్నారు.పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తున్నారని అన్నారు.ఎస్. సి అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేస్తున్నాడని అన్నారు. ఎస్. సి లమీదే అట్రాసిటీ చట్టం మోపుతున్నారని అన్నారు. ప్రజా దనం లూటీ చేస్తూ ఆఖరికి సాక్షి లో పని చేసే ఉద్యోగు లకు ప్రజల సొమ్ము జీతాలు గా ఇస్తున్నారని అన్నారు. జగన్ ని తరిమి కొట్టడం లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు సాగాలని అన్నారు.ప్రజలకు పది రూపాయలు ఇచ్చి 100.. రూపాయలు వెనక్కి తీసుకుంటున్నాడని అన్నారు.మోడీ గారు అట్టడుగు స్థాయి నుండి వచ్చి ప్రజలకు ఆదర్శం గా వున్నారు అన్నారు.అవినీతి లేని పాలన చేస్తున్నారని అన్నారు.మోడీ గారి పాలన వస్తేనే రాష్టానికి భవిష్యత్తు అని కన్నా అభిభాషించారు. రాష్ట్రము అభివృద్ధి జరగాలి అంటే బీజేపీ అధికారం లోకి రావాలని అన్నారు.సభకు దారా అంబేద్కర్ అధ్యక్షత వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here