త్రిపురాంతకం లో స్వయంభువుగా వెలసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.తెల్లవారుజాము నుండే భక్తుల అధిక సంఖ్యలో అమ్మ దర్శనం కోసం క్యూ లైన్ లలో జై బాల జై జై బాలా అంటూ భక్తి పారవశ్యంతో ఉన్నారు. ఆలయ ప్రధాన ఆర్చకులు ప్రసాద్ శర్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.విజయనగరం జిల్లా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతులు,కుటుంబ సభ్యులు,మార్కాపురం జిల్లా ఆర్ టి వో మాధవరావు శ్రీ చక్రం వద్ద కుంకుమ అర్చనలు చేశారు.సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధూప దీప నైవేద్యం సమర్పించి స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు.భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల ఈ ఓ ఈదుల చెన్నకేశవ రెడ్డి ఆలయాల ధర్మకర్తల మండలి సబ్యులు క్యులైన్లు,ఏర్పాట్లను చేశారు.
