త్రిపురాంతకం లో స్వయంభువుగా వెలసిన శ్రీ మత్ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం మూడవ శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావటంతో మహిళ భక్తులు వేకువజామునుంచే, చన్నీటి స్నానం ఆచరించి, ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
మహిళ భక్తులు ఆలయానికి పోటెత్తారు.ఆర్చకులు ప్రసాద్ శర్మ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.దంపతులు శ్రీ చక్రం వద్ద కుంకుమ అర్చనలు చేసారు.పౌర్ణమి సందర్భంగా ఆలయప్రాంగణం లో మహిళలతో లక్ష కుంకమార్చన,మరియు నవధాన్యార్చన నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధూప దీప నైవేద్యం సమర్పించి స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు.
శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో అపరాధీశ్వర స్వామి వారి శంకుస్థాపన చేశారు.ఆలయ ప్రఫన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి విశేష పూజలు నిర్వహించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ ఈదుల చెన్నకేశవ రెడ్డి తెలిపారు.