అర్ధరాత్రి బాబా గుడిలో చోరీ..

0
3

గునపంతో హుండీ కొల్లగొట్టిన మైనర్లు

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని సాయిబాబా గుడి రాత్రవడంతో పూజారులు తాళాలు వేసి వెళ్లిపోయారు. అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ముగ్గురు యువకులు ఒక బైక్‌పై వచ్చి గేటు తాళం తీసి లోపలికి వెళ్లారు. గుడి లోపలికి వెళ్లేందుకు వీలు పడకపోవడంతో.. డోర్‌ను పగలగొట్టడానికి ఒక గునపం తీసుకుని వచ్చి బలంగా బాది గర్భగుడిలోకి ప్రవేశించారు. హుండీని పగలగొట్టి అందులో నగదును అపహరించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ముగ్గురు మైనర్లు చక్కగా బాబా గుడిలో ప్రవేశించి.. హుండీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుని. కాస్తంత శ్రమ పడి ఆ హుండీని ఓ రాడ్డుతో పగలగొట్టి అందులో సొమ్ము తీసుకుని అంతే దర్జాగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయని తెలుసుకుని మొహాన్ని చాటుకోవడానికి వీళ్లు ఎంతో కష్టపడ్డారు పాపం. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని సాయిబాబా గుడి రాత్రవడంతో పూజారులు తాళాలు వేసి వెళ్లిపోయారు. అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ముగ్గురు యువకులు ఒక బైక్‌పై వచ్చి గేటు తాళం తీసి లోపలికి వెళ్లారు. గుడి లోపలికి వెళ్లేందుకు వీలు పడకపోవడంతో.. డోర్‌ను పగలగొట్టడానికి ఒక గునపం తీసుకుని వచ్చి బలంగా బాది గర్భగుడిలోకి ప్రవేశించారు.

మొదటగా లోపలికి వెళ్లిన యువకుడు అక్కడ కనిపిస్తున్న హుండీని పైకి లేపేందుకు ప్రయత్నించగా.. అతని వల్ల కాకపోవడంతో ఈసారి ఇద్దరు మైనర్లు వచ్చి హుండీని బయటకు తీసుకెళ్లారు. గుడి సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో రాడ్లతో హుండీని పగలగొట్టి అందులోని నగదు అపహరించి అక్కడ నుంచి ఉడాయించారు. అర్ధరాత్రి 2:29 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. దీనిపై కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు కేసు మైనర్లు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here