‘అల్లం టీ’తో అద్భుత ప్రయోజనాలు..

0
6

‘అల్లం టీ’తో అద్భుత ప్రయోజనాలు

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని ఎప్పట్నుంచో చెబుతున్నారు. అల్లంని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. అయితే.. ఆ అల్లంతోనే టీ చేసుకుని తాగడం వల్ల 8 అద్భుత ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1.అజీర్తితో బాధపడేవాళ్లు రెగ్యులర్‌గా ఈ టీ తీసుకోవడంతో సమస్య బాధించదు.

2.అల్లం టీని రెగ్యులర్‌గా తీసుకోవడంతో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది.

3.బాడీలో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

4.అంతేకాదు.. అధికబరువుని తగ్గించి, చెడుకొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సమస్యలు రాకుండా చూస్తుంది.

Overweight

5.మహిళలకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో వచ్చే నొప్పిని అరికడుతుంది.

6.చాలామంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటివారికి ఈ టీ ఉపశమనం కలిగిస్తుంది

7.ఈ టీని తాగడం వల్ల ఒత్తిడి దూరమవ్వడమే కాక తలనొప్పిని తగ్గిస్తుంది.

8.సీజన్‌ మారుతున్న సమయంలో చాలామంది అనారోగ్యానికి గురవుతారు. అలాంటి సమయాల్లో ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది.

9.అల్లంలోని యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలవల్ల అలర్జీలూ ఆస్తమా కూడా తగ్గుముఖం పడతాయి.

10.దూర ప్రయాణాల్లో చాలామంది వాంతులు చేసుకుంటుంటారు.. అలాంటి సమయాల్లో అల్లం టీ ముందుజాగ్రత్తగా తీసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here