అల్లం నారాయణకు అభినందనల వెల్లువ..

0
1

మీడియా అకాడమీ చైర్మన్ గా హ్యాట్రిక్

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ హ్యాట్రిక్ పొందారు. వరుసగా మూడు సార్లు మీడియా అకాడమీ చైర్మన్ గా నియామితులై రికార్డు సృష్టించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యుజె, హెచ్-143) రాష్ట్ర అధ్యక్షుడైన అల్లం నారాయణకు మీడియా అకాడమీ చైర్మన్ పదవి మూడోసారి వరించడం విశేషం. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం స్థాపించి తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను, సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి జర్నలిస్టుల ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేయించడంలో అల్లం నారాయణ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, పలు ప్రజా సంఘాలు అల్లం నారాయణ హ్యాట్రిక్ పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మాసబ్ ట్యాంక్ లోని సమాచార, పౌర సంబంధాల శాఖ భవనంలోని మీడియా అకాడమీ చైర్మన్ కార్యాలయంలో బుధవారం పలువురు జర్నలిస్టు అల్లం నారాయణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, టెంజు అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ, హైదరాబాద్ అధ్యక్షుడు యోగానంద్, రాష్ట్ర నాయకుడు పైళ్ల విఠల్ రెడ్డి, తదితర సీనియర్ జర్నలిస్టులు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. టియుడబ్ల్యుజె రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, కోశాధికారి పాలెపల్లి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు, జర్నలిస్ట్ నాయకులు పైళ్ల విఠల్ రెడ్డి, కొండ విజయ్ కుమార్, పుట్ట వినయ్ కుమార్ తదితరులు చైర్మన్ అల్లం నారాయణను శాలువా, పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here