అల్ ఖైదా అధినేత అయ్ మన్ అల్ జవహరీ హతం..!

0
14

అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్‌-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో అల్‌-జవహరీని హతమార్చినట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు.
ఈ మేరకు అమెరికాకు చెందిన మీడియా సంస్థలు వార్తలు వెలువరిస్తున్నాయి.
మరోవైపు అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ఓ విజయవంతమైన ఉగ్రవాద నిరోధన ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బిడన్‌ ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం నేటి సాయంత్రం 7:30 గంటలకు ఈ ఆపరేషన్‌ వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here