అశోక ధర్మ సింహాలు -మోడీ క్రూర సింహాలు..

0
3

బౌద్ధ ధర్మ ప్రచార కార్యక్రమం: అశోక ధర్మ సింహాలు -మోడీ క్రూర సింహాలు.తేది 12-8-22 న ఒంగోలు కలెక్టర్ కార్యలయం వద్ద అషా డ పౌర్ణమి సందర్భంగా బౌద్ధ ధర్మ ప్రచార కార్యక్రమం ఉదయం 10.00 గంటలకు ప్రారంభమైనది.

.ప్రారంభ కార్యక్రమములోబుద్ధ భూమి ఆగస్టు సంచికలో ముఖ చిత్రంగా వున్న నాల్గు సింహాలు పత్రికను ఆవిష్కరించడ మైనది మరియు 60 వివిధ రకముల బౌద్ధ సాహిత్య పుస్తకాలు ప్రదర్శనకు పెట్టడమైనది ఇంకను కరపత్రాలను పంచడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమాఖ్య నాయకుడు చుండూరు రంగారావు,బహుజన నాయకుడు మిరియం అంజిబాబు, యువజన విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు భీమవరపు సుబ్బారావు, ఒ.పి.డి.అర్.రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర రావు, బౌద్ధ ప్రచార సమితి కన్వీనర్ ఆర్జా లక్ష్మీ ప్రసాదరావు, జండ్రజు ఆంజనేయులు, వేశపోగు చంద్ర మరియు ఏ.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.రైతు నాయకులు చుండూరు రంగారావు గారు భారత రాజ్యాంగం చిహ్నాలు మరియు ప్రతీకలైన అశోక చక్రవర్తి నిర్మిత అశోక ధర్మ చక్రం, ధర్మ విజయ చిహ్నాలు నాలుగు సింహాలు మొదలగు వాటి స్ఫూర్తితో ప్రజా పాలన చేయాలని అశోకుని నాల్గు సింహాలు ప్రధాని మోడీ నాల్గు సింహాలు ఒకటి కాదు కనుక అశోకుని నాల్గు సింహాల నే పెట్టాలలి మరియు బౌద్ధ ధర్మం దేశానికే కాదు ప్రపంచానికి అవసరమైనది కనుక బౌద్ధ ధర్మాన్ని ప్రజల లోకి తీసుకొని వెళ్ళాలి అని మరియు పాలకులు బౌద్ధ ధర్మం ప్రకారము పాలించాలని అన్నారు. ఒ.పి.డి.అర్.రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర రావుగారు బౌద్ధ ధర్మం యొక్క పంచశీల : 1 జీవహింస చేయరాదు 2. దొంగతనము చేయరాదు 3. వ్యభిచరించరా దు 4. అసత్యంచెప్పరాదు 5. మత్తు పదార్థాలను, మద్యాన్ని సేవించరాదు.

ఈ పంచశీల రాజ్యాంగం లో ఉన్నప్పటికీ దానిని పాలకులు పాటించకుండా దానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్నారు కనుక పాలకులు,అధికారులు పంచశీల పాటించి ప్రజలు పంచశీల పాటించేలా పరిపాలన చేయాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here