ఆంధ్రప్రదేశ్‌లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. 

0
2

 ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్‌ స్కూళ్లలో ఒప్పంద ప్రాతిపదికన ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(PGT) పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 282 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో టీజీటీ 71, పీజీటీ 211 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాలి. ఆగస్టు 17 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 282

 • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ): 71 పోస్టులు
 • పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ): 211 పోస్టులు

జోన్ల వారీగా ఖాళీలు:

 • టీజీటీ పోస్టులు జోన్‌ 1లో- 17, జోన్‌ 3లో- 23, జోన్‌ 4లో- 31 ఉన్నాయి.
 • పీజీటీ పోస్టులు జోన్‌ 1లో- 33, జోన్‌ 2లో- 4, జోన్‌ 3లో- 50, జోన్‌ 4లో- 124 ఉన్నాయి.

ముఖ్య సమాచారం:

 • అర్హతలు: పీజీటీ ఖాళీలకు రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎంకాం అప్లయిడ్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీకి అనర్హులు.
 • టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టు్లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో బీఈడీ, తదితర ప్రొఫెషనల్‌ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
 • వయోపరిమితి: సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్‌ వారికి 49 ఏళ్లు ఉండాలి.
 • ఎంపిక విధానం: జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. డిగ్రీ, పీజీకి 60 శాతం, బీఈడీకి 10 శాతం, గతంలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా చేసినవారికి 20శాతం, టీచింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, టీచింగ్‌ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

 • దరఖాస్తు విధనాం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఆగ‌స్టు 17, 2022
 • ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితా ప్రకటన: ఆగస్టు 23, 2022
 • అభ్యంతరాల స్వీకరణ తేదీలు: ఆగస్టు 24 – 25
 • ఇంటర్వ్యూ జాబితా విడుదల: ఆగస్టు 29, 2022
 • వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహణ: నవంబరు 8, 2022
 • ఎంపికైన అభ్యర్థుల జాయినింగ్‌ తేది: నవంబరు 9, 2022
 • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://cse.ap.gov.in/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here