గత నెలలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందాలు బుధవారం విశాఖలో ప్రభుత్వశాఖల అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆర్ధిక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలోని బృందం డాక్టర్.కె.మనోహరన్, శ్రావణ్ కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాధన్, అరవింద్ కుమార్ సోని సభ్యులకు జరిగిన నష్టాలని , వరద తీవ్రత ప్రభావాన్ని , రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ కేంద్ర బృందానికి వివరించారు.

అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఒక బృందం, ఏలూరు జిల్లాకి ఒక బృందం పర్యటినకు వెళ్ళాయి. ఈ సమావేశంలో విపత్తుల సంస్థ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ డా.సి.నాగరాజు, వ్యవసాయ, ఉధ్యాన, మత్స్య శాఖ, పౌరసరఫరాల శాఖ, పంచాయితీరాజ్. గ్రామీణాభివృద్ధి, పశుసంరక్షణశాఖ, జలవనరుల శాఖ, పబ్లిక్ హెల్త్ , విద్యుత్ శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ ఇతర అదికారులు పాల్గొన్నారు.
రేపు డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. సాయంత్రం ముఖ్యమంత్రి గారితో కేంద్ర బృందం సమావేశం కానుంది.