ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్ లతో భయాందోళనలకు గురి చేస్తున్న సుంకర ప్రసాద్ నాయుడు ముఠాను గుంతకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్న సుంకర ప్రసాద్ నాయుడు సహా 13 మందిని అరెస్టు. గుంతకల్లు మండలం జి. కొట్టాలకు చెందిన కోనంకి వెంకటేష్ ను డబ్బు కోసం ఈనెల 20 వ తేదీన కిడ్నాప్ చేసిన సుంకర ప్రసాద్ నాయుడు ముఠా... కిడ్నాప్ చేసి డోన్ సమీపంలోని ఓబుళాపురంపై మిట్టపై దాచి కోటి రూపాయిలు డబ్బు తీసుకురావాలని లేదంటే చంపుతామని బాధిత కుటుంబ సభ్యులకు బెదిరించిన వైనం. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాలతో గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, గుంతకల్లు రూరల్ సి.ఐ లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో సిబ్బంది కి పక్కా రాబడిన సమాచారంతో డోన్ సమీపంలోని ఓబుళాపురంపై మిట్టపై కిడ్నాపర్ల ముఠాను అరెస్టుచేసి బాధితునికి విముక్తి కల్పించిన పోలీసులు. ఈ ఘటనతో పాటు గత నెల 29 న స్వామీజీ ముత్యాల గంగరాజును కిడ్నాప్ చేసి రూ. 24 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేశారు, వీరి నుండీ ఒక ఫిస్టోల్, 16 తుటాలు, స్కార్పియో, ఇటీయాస్, బుల్లెట్ వాహనాలతో పాటు రూ. 6.50 లక్షల నగదు స్వాధీనం , రెండు దశాబ్దాలకు పైగా నేర చరిత్ర ఉన్న సుంకర ప్రసాద్ నాయుడిపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 11 కేసులు ఉన్నాయి. వీటిలో హత్యలు, కిడ్నాప్ లు, బలవంతపు వసూళ్లు, దొంగతనం కేసులు ఉన్నాయి గుంతకల్లు మండలం జి.కొట్టాలకు చెందిన మోహన్ నాయుడు ముఠా నాయకుడి యూట్యూబ్ ఇంటర్వూలతో ఆకర్షణకు గురయ్యాడు. అతనిని సంప్రదించి ప్రస్తుతం అరెస్టయిన వారిలో మిగితా వారిని కలుపుకుని ముఠా నేరాల్లో పాలు పంచుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన సుంకర ప్రసాద్ నాయుడి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న గుంతకల్లు డీఎస్పీ బృందాన్ని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి అభినందించారు. సుంకర ప్రసాద్ నాయుడు మరియు ఆయన ముఠా చేతుల్లో ఈ తరహా ఇబ్బంది పడివుంటే తమని సంప్రదించాలి : జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప కాగినెల్లి. అరెస్టు చేసిన ముఠా సభ్యుల వివరాలు 1) సుంకర ప్రసాద్ @ఆర్లగడ్డ ప్రసాద్ @ సుంకర ప్రసాద్ నాయుడు @ ఆళ్లగడ్డ ప్రసాద్ రెడ్డి, వయస్సు. 50 సం.లు, గుడిమెట్ట గ్రామము, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా, ప్రస్తుతము వెంకట రెడ్డి కాలనీ, చెర్లోపల్లి, హైదరాబాద్. 2) తమ్మినేమి మోహన్ నాయుడు, వయస్సు 35 సంలు, ఓసి కాలనీ, 6.కొట్టాల గ్రామము, గుంతకల్లు మండలము 3) ఇల్లందుల రంజిత్, వయస్సు 24 సం.లు,, తిమ్మంపేట్ గ్రామము, జాఫర్ ఘడ్ మండలం, జనగాం జిల్లా, తెలంగాణ 4) సైబా భాస్కర్, వయస్సు 39 సంలు, వీరన్న పేట, మహబూబ్ నగర్ మండలము & జిల్లా. తెలంగాణా రాష్ట్రం 5) కసుముర్తి విజయ భాస్కర్ బాబు, వయస్సు 48 సం,,జి. కొట్టాల గ్రామం, గుంతకల్ మండలం 6) కుంకుమ మధు, వయస్సు 23 సం.లు, BC కాలనీ, జి. కొట్టాల గ్రామం, గుంతకల్ మండలం 7) రమణయ్య, @ మోట రమణయ్య, వయస్సు 47 సం,, కొత్తబురుజు గ్రామము, ప్యాపిలి మండలం, కర్నూల్ జిల్లా, ప్రస్తుతం భీమిరెడ్డి కాలనీ, గుంతకల్ 8) బోనాల వెంకటేష్, వయస్సు 36 సం.లు, ACS మిల్ కాలనీ, గుంతకల్ 9) పులి రామాంజినేయులు, వయస్సు 30 సం.లు, సత్యనారాయణ పేట, గుంతకల్ 10) పసునూరి అనిల్ కుమార్, వయస్సు 28 సం.లు, హిమ్మత్ నగర్ గ్రామము, జాఫర్ ఘడ్ మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ప్రస్తుతము చర్లపల్లి గ్రామము, హైదరాబాద్. 11) ప్రేమ్ కమల్, వయస్సు 25 సం.లు, గోవిందాపురం గ్రామము, హుజూర్ నగర్, సూర్యాపేట్ జిల్లా, తెలంగాణ రాష్ట్రము, ప్రస్తుతము చర్లపల్లి గ్రామము, హైదరాబాద్. 12) పప్పు సింగ్, వయస్సు 38 సం.లు, చెర్లోపల్లి గ్రామము, హైదరాబాద్. 13) చుక్క వెంకటేష్, వయస్సు 29 సం.లు, గట్లఖాన్పూర్ గ్రామము, పెద్దమండది మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రము.