ఆగష్టులో ముఖ్యమైన పండగలు..

0
4

వరలక్ష్మి వ్రతం నుంచి వినాయక చవితి వరకూ ఏ రోజు ఏ పండగలు వచ్చాయంటే
శ్రావణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే నాగ పంచమి వ్రతంతో ఈ నెల ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి తో ముగియనుంది. అయితే ఈఏడాది కృష్ణాష్టమి మిగులు తగులు రూపంలో రెండు రోజులు రావడం విశేషం
ఏపి క్రైమ్ న్యూస్

హిందువులకు నెలనెలా పండగలు, పర్వదినాలు వస్తాయి. లోగిళ్ళలో సందడిని తెస్తాయి. ఇక పండగల సమయంలో పూజలు, ఉపవాసాలు చేస్తారు. ఆగస్టు నెలలో కూడా అనేక వేడుకలతో నిండి ఉంటుంది. మహిళలు, పిల్లలు, పెద్దలకు ఇష్టమైన పండుగలన్నీ ఈ నెలలో వస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం, రక్షా బంధన్ , కృష్ణ జన్మాష్టమితో సహా అనేక పవిత్రమైన పండుగలు ఆగస్టులో జరుపుకోనున్నారు. కనుక ఆగష్టు నెల హిందువులకు ముఖ్యమైన నెల కానుంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే నాగ పంచమి వ్రతంతో ఈ నెల ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి తో ముగియనుంది. అయితే ఈఏడాది కృష్ణాష్టమి మిగులు తగులు రూపంలో రెండు రోజులు రావడం విశేషం..

ఆగస్ట్ 2022 నెలలో పండుగల పూర్తి జాబితా:

ఆగస్టు 2: నాగ పంచమి ఆగస్టు 4: తులసీదాస్ జయంతి ఆగస్టు 5: శ్రీ దుర్గాష్టమి ఉపవాసం ఆగస్టు 8: శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 9: ప్రదోష ఉపవాసం ఆగస్టు 11: శ్రావణ పూర్ణిమ, రక్షా బంధన్, జంధ్యాల పౌర్ణమి ఆగస్టు 12: వరలక్ష్మీ వ్రతం ఆగస్ట్ 14: కజారీ తీజ్ వ్రతం ఆగస్ట్ 15: స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 18 , 19: కృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ 23: అజ ఏకాదశి ఆగస్టు 31: వినాయక చవితి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here