ఆగస్టు 15న నేవీ చేతికి విక్రాంత్..

0
5

భారతదేశ నిపుణులతో దేశీయంగా తయారైన మొదటి యుద్ధ విమాన వాహన నౌక ‘విక్రాంత్’ను కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రతినిధులు భారత నౌకాదళానికి అప్పగించారు. ఈ మేరకు ఇరు ప్రతినిధుల మధ్య సంతకాలు కూడా జరిగాయి. భారత నౌకాదళానికి చెందిన ఇన్‌హౌస్ డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ దీని డిజైన్ రూపొందించింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళలో విక్రాంత్‌ను నేవీ విధుల్లోకి చేర్చుకోనుంది.

భారతదేశ నిపుణులతో దేశీయంగా తయారైన మొదటి యుద్ధ విమాన వాహన నౌక ‘విక్రాంత్’ను కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రతినిధులు భారత నౌకాదళానికి అప్పగించారు. ఈ మేరకు ఇరు ప్రతినిధుల మధ్య సంతకాలు కూడా జరిగాయి. భారత నౌకాదళానికి చెందిన ఇన్‌హౌస్ డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ దీని డిజైన్ రూపొందించింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విక్రాంత్‌ను నేవీ విధుల్లోకి చేర్చుకోనుంది.

1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన దేశ మొదటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియల్ ఐఎన్ఎస్ విక్రాంత్ పేరే దేశీయంగా తయారైన ఈ నౌకకు పెట్టడం గర్వించదగ్గ విషయం. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న సమయంలో భారత నౌకాదళంలోకి విక్రాంత్ చేరిక కీలక పరిణామమని నేవీ అధికారులు చెబుతున్నారు. 262 మీటర్ల పొడవున్న విక్రాంత్‌ను రూ.20 వేల కోట్లతో నిర్మించారు. విక్రాంత్ తుది దశ సీ ట్రయల్స్ మూడు వారాల కిందట విజయవంతంగా పూర్తయిందని నేవీ అధికారులు పేర్కొన్నారు.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విక్రాంత్ అందడం చారిత్రాత్మకమేనని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. నౌక నిర్మాణంలో 76 శాతం దేశీయంగా తయారు చేసిన సామగ్రినే వినియోగించారు. మేక్ ఇన్ ఇండియాకు ఇది ఉదాహరణగా నిలుస్తోందని అధికారులు అంటున్నారు. ఐఏసీలో 2,300 కంపార్టుమెంట్లుండగా 1,700 మంది సిబ్బంది పనిచేసేందుకు అనుగుణంగా నౌకా నిర్మాణం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here