ఆగస్టు 6వ తేదీన JEE మెయిన సెషన్‌ 2 ఫలితాలు..

0
6

 జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షా ఫలితాలు ఆగస్టు 6న విడుదల కానున్నాయి. ఆగస్టు 6న ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ పరీక్షల ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ ఆగస్టు 3న వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఆన్సర్‌ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఇందుకోసం అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు నాన్‌ రిఫండబుల్‌. జేఈఈ మెయిన్‌ 2022 ఫలితాలు, ఆన్సర్‌ కీని https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here