ఒంగోలు హైవే పక్కన నిలిపి ఉన్న లగేజీ ఆటోలో రూ.2.70 లక్షలు నగదు, సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు డ్రైవర్ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఒంగోలు సమీపంలోని మూక్తినూతలపాడు వెళ్లే అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. నెల్లూరు జి ల్లా గుడ్లూరు మండలం పురేటిపల్లికి చెందిన బత్తుల అనీల్‌కుమార్ ఏపీ 39 Oaa 1073 నంబరు గల ఆటోలో తన గ్రామానికి చెందిన రైతుల పత్తిని గుంటూ రు తీసుకెళ్లాడు. అక్కడ 30 కింట్వాళ్ల పత్తిని విక్రయించగా రూ.2.70 నగదు వచ్చింది. ఆ మొత్తాన్ని ఆటోలోని డ్యాష్ బోర్డులో ఉంచి, అక్కడే సెల్‌ఫోన్ పెట్టి రాత్రి 1.30 సమ యంలో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేసి నిద్రపోయాడు. అయితే 2 గంటల సమ యంలో నిద్రలేచి చూసే సరికి నగదు, సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో వెంటనే తాలు కా పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.