- ఆగి ఉన్న బస్సును వెనకనుంచి స్కూటీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన యడ్లపాడు నక్క వాగు సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
- వివరాల్లోకి వెలితే.. వసంత నూనె మిల్లు కు చెందిన బస్సు కార్మికులను తీసుకువచ్చేందుకు ఎడ్లపాడు వైపు వెళ్తూ నక్క వాగు సమీపంలోని సుబాబుల తోట వద్ద హైవేపై నిలుపుదల చేసి డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అదే మార్గంలో చిలకలూరిపేట కు చెందిన తల్లి కూతుళ్లు తల్లి నాగలక్ష్మి కుమార్తె సాయి లక్ష్మి చిలకలూరిపేట వైపు నుంచి గుంటూరు స్కూటీపై వెళ్తున్నారు. బస్సు సమీపంలోకి రాగానే స్కూటీ ముందు వెళ్తున్న బైక్ పై వారు రోడ్డుపై దిష్టి కొబ్బరికాయ కొట్టి వెళ్లడంతో అది గమనించిన స్కూటీ పై ఉన్న సాయి లక్ష్మి(30) పక్కకు తీయబోయి అదుపుతప్పి ఆగి ఉన్న బస్సు వెనుక భాగంలో ఢీకొంది.
- ఈ ప్రమాదంలో సాయిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా నాగలక్ష్మి కి తీవ్ర గాయాలయ్యాయి. వారు చిలకలూరిపేట ఆర్ వి ఎస్ సి వి ఎస్ హైస్కూల్ వద్ద ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్నారు. 108 వాహన సిబ్బంది నాగలక్ష్మిని గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.