ఆజాది కా అమృత్ మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ..

0
6

భారత దేశానికి స్వాతంత్ర్యము లభించి 75 సంవత్సరములు పూర్తవుతున్న సందర్భముగా, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమము “ఆజాది కా అమృత్ మహోత్సవాలలో ” భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు కేంద్ర కార్యాలయ ఆదేశముల మేరకు ప్రకాశం జిల్లాలో ది.11.08.2022వ తేది నుండి ది.25.08.2022 వరకు నిర్దేశించిన కార్యక్రమాలను జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీ బి.సుధాకర్ గారు ప్రారంభించారు.

ముందుగా ది.10.08.2022వ తేది రాత్రి నుండి జిల్లా లోని ఐదు డిపోలలోని మొత్తం 518 బస్సులలో ప్రయాణీకులు బస్సు ఎక్కునప్పుడు గమనించు విధంగా “ఆజాది కా అమృత్ మహోత్సవాల గురించి తెలియ పరిచే స్టిక్కర్లను అంటించటమైనది. DPTO గారి ఆదేశంతో ఒంగోలు డిపో మేనేజరు గారు ఒంగోలు బస్టాండు నందు “ఆజాది కా అమృత్ మహోత్సవాలలో భాగంగా బస్టాండు పరిసరాలను సుందరంగా త్రివర్ణ రంగులతో అలంకరణ చేయించారు. బస్టాండు పై భాగంలో త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. ది.13.08.2022వ తేదిన ఒంగోలు డిపో సిబ్బందితో పాదయాత్ర చేపట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here