ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తీరంగా…

0
9

ఈ నెల ఆగస్టు 15 నాటికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయంలో, భారత స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రజల్లో నింపడమే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాలు పంచుకోవడం జరుగుచున్నదని, ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్ పిలుపునిచ్చారు.శనివారం సాయంత్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తీరంగా కార్యక్రమాల్లో భాగంగా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ, కృష్ణచైతన్య విద్యా సంస్థ సంయుక్తంగా వి.ఆర్.కళాశాల గ్రౌండ్ లో గాలిపటాల ఎగురవేత కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, బెలూన్లను ఎగురవేశారు. కృష్ణచైతన్య విద్యా సంస్థల విద్యార్ధులు ఈ సంధర్భంగా వి.ఆర్. కళాశాల గ్రౌండ్ చుట్టూ జాతీయ జెండాను ప్రదర్శించడం, అలాగే భారత దేశం మ్యాప్ నమూనాలో జాతీయ జెండాను ప్రదర్శించడం ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సంధర్బంగా జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్ మీడియాతో మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తీరంగా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 1వ తేదీ నుండి 15 రోజుల పాటు ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేలా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ, కృష్ణచైతన్య విద్యా సంస్థల ఆద్వర్యంలో గాలిపటాల ఎగురవేత కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ రోజు నుండి 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తూ పండుగ వాతావరణంలో హర్ ఘర్ తీరంగా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాలు పంచుకోవడం జరుగుచున్నదని, ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్ పిలుపునిచ్చారు.జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో ఆగస్టు, 1వ తేదీ నుండి ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేలా జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నవన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన నెల్లూరు నగరం నుండి దాదాపు 13 కిలో మీటర్ల దూరంలో వున్న పల్లిపాడు పినాకినీ గాంధీ ఆశ్రమం వరకు వారసత్వ నడకను నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ రోజు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ, కృష్ణచైతన్య విద్యా సంస్థల ఆద్వర్యంలో గాలిపటాల ఎగురవేత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు శ్రీ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆద్వర్యంలో నిత్యం జరిగే సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావడం జరుగుతుందని శ్రీ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకట నారాయణమ్మ, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ శ్రీమతి వాణీ, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, జిలా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి కనక దుర్గా భవానీ, రెడ్ క్రాస్ సంస్థ వైస్ ఛైర్మన్ శ్రీ దామిశెట్టి సురేష్ నాయుడు, రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు, కృష్ణ చైతన్య విద్యా సంస్థ విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు……………………………….జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయం, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here