మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయతీ పరిధి మల్లికార్జున్ నగర్ కాలానీలో ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా కందుకూరు కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గౌరవ జి వాణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగపరంగా మహిళల రక్షణకు,
మహిళలపై, చిన్నారులపై జరిగే నేరాలకు చట్టపరంగా కఠినమైన శిక్షలు ఉన్నాయని,వీటిని తెలుసుకొని మిమ్మల్ని, మీ బిడ్డల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మీ పరిసర ప్రాంతాల్లో మహిళలపై,చిన్నారులపై జరిగే ఆకృత్యాలను ఉపేక్షించకుండా దగ్గరలో పోలీసు వారికి ఫిర్యాదు చేసి తగు న్యాయం పొందాలని సూచించారు.
కార్యక్రమానికి సభ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సీనియర్ న్యాయవాది సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు పలు చట్టాలను గురించి కూలంకషంగా వివరించారు. ముఖ్యంగా చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకొని అవగాహన రాయిత్యంతో అతి తక్కువ సమయంలోనే విడాకుల కొరకు కోర్టు మెట్లు ఎక్కుతున్న దంపతుల గురించి వివరిస్తూనే అదేవిధంగా అతిపిన్న వయసులోనే పలు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు పొంది లక్షల జీతాలు అర్జిస్తున్న ఆడపిల్లల విజయగాదలను ఉదాహరణలతో చెప్పి సభికులను ఆలోచింపజేశారు.
కార్యక్రమంలో న్యాయవాది బక్కమంతుల వెంకటేశ్వర్లు, న్యాయ సేవా సహాయకులు పంతగాని వెంకటేశ్వర్లు, కోర్టు సిబ్బంది శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.