పాలకుర్తి వెలుగు పాఠశాలలో విద్యార్థినులకు దుస్తులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆడపిల్లలు చదువుకుంటే, ఉన్నత స్థానాలకు చేరుకుంటేనే మొత్తం సమాజంలో వికాసం సాధ్యం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళా విద్యతోనే వికాసం జరుగుతుందని అన్నారు. ఆడ వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందున్నారని చెప్పారు. పిల్లలు బాగా చదువుకోవాలని ఉద్బోధించారు. జనగామ జిల్లా నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి లోని వెలుగు స్కూల్ లోని విద్యార్థిని లకు మంత్రి దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో సమంగా, సగంగా ఉన్న మహిళలతో కుటుంబం నుంచి రాష్ట్రం, దేశం వరకు అభివృద్ధి చెందుతుందన్నారు. పిల్లల చదువుల పట్ల తల్లి తండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వారి ఆశలు, ఆశయాలకు తగ్గట్లుగా పిల్లలు చదువుకోవాలని అన్నారు. పిల్లలు బాగా చదువుకొని, ఉన్నత స్థానాలకు చేరితేనే చదువుకు సార్థకత లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు గర్వపడేలా పిల్లలు ఎదగాలని ఉద్బోధించారు. కొద్దిసేపు పిల్లలతో మంత్రి మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాలు, చదువులపై మాట్లాడారు. అనంతరం వాళ్లకు దుస్తులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, వెలుగు పాఠశాల టీచర్లు, విద్యార్థిని లు పాల్గొన్నారు.