ఆదివారం జరగనున్న SI ప్రిలిమినరీ  EXAM

0
9

-ఒక్క నిమిషం లేట్ అయినా అనుమతించేది లేదు

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. జూన్ 30 నుంచి ఈనెల 5వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఆదివారం పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు.. హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫొటో అతికించి తీసుకురావాలని అధికారులు సూచించారు. సెల్ ఫోన్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. కేవలం హాల్ టికెట్ తోపాటు బ్లూ, బ్లాక్ పెన్నుని తీసుకొని రావాలని వెల్లడించారు.హైదరాబాద్ (Hyderabad) తోపాటు సిటీ ఔట్ అవతల 503 సెంటర్లు, జిల్లా కేంద్రాల్లో 35 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా.. అభ్యర్థులను సెంటర్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 9 గంటల నుంచి ఎగ్జామ్ హాల్ లోకి అభ్యర్థులను పంపిస్తారు. ఓఎమ్ఆర్ షీట్ పై ఎలాంటి రాతలు రాసినా కూడా తీసుకోబోమని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (Police Recruitment Board) అధికారులు వివరించారు. పరీక్ష కోసం వచ్చే అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది కాబట్టి.. మెహందీ, టెంపరరీ ట్యూటూలు ఉండకుండా చూసుకోవాలని సూచించారు.తెలుగు మీడియం ఎంచుకున్న వారికి.. ఇంగ్లీష్-తెలుగు, ఉర్దూ మీడియం సెలక్ట్ చేసుకున్న వారికి ఇంగ్లీష్- ఉర్దూ భాషల్లో ప్రశ్నాపత్రపం ఇవ్వనున్నారు. ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 200 మార్కులు ఉండనున్నాయి. 60 మార్కులు పొందితే క్వాలిఫై అవుతారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో నెగెటివ్ మార్కులు ఉంటాయి. అభ్యర్థులు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చేయాలని సూచిస్తున్నారు. ఒక్క రాంగ్ ఆన్సర్ కి 0.2 నెగటివ్ మార్క్స్ ఉంటాయి. ఐదు తప్పుడు సమాధానాలు ఇస్తే.. ఒక మార్కును కట్ చేస్తారు. పరీక్ష రాసిన అభ్యర్థులు.. ప్రిలిమినరీ ఫలితాలు వచ్చేదాకా హాల్ టికెట్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here