ఆదివాసీ మహిళపై హత్యాయత్నం..

0
6
murder attempt to adhivasi mahila

బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆదివాసీ మహిళపై హత్యాయత్నం దాడి సంఘటన పై ఎస్ సి ఎస్ టి కేసు నమోదు…
దర్యాప్తు చేపట్టిన పోలీస్లు
గ్రామ దేవత,యానాదుల కుల దైవం పోలేరమ్మ జాతర సందర్భంగా ఆదివారం సింగరాయకొండ బుంగ భావి సెంటర్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన పై ఎస్ సి ఎస్ టి కేసు నమోదయింది. ఈ నెల 24 ఆదివారం సింగరాయకొండ, బుంగబాయి ఎస్టీ కాలనీలో తన ఇంటిలో ఒక్కరే ఉన్న సమయంలో 30 మంది గుర్తు తెలియని ఒక సామాజిక వర్గం వ్యక్తులు మారణాయుధాలతో మూకుమ్మడి దాడి కి పాల్పడి తీవ్ర గాయాలకు గురి చేశారని ఆమని వసుంధర ఇచ్చిన ఫిర్యాదు తో సింగరాయకొండ పోలీస్ లు దాడి చేసిన వారి పై క్రిమినల్ కేసు తో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. తల్లి పై జరిగిన దాడి హత్యాయత్నం సంఘటన లో అఫుకునెందుకు అడ్డుకున్న తన కుమారుడు అడ్డుపడటం తో తృటిలో ప్రాణాపాయం తప్పినట్లు ఆమె తన ఫిర్యాదు లో పేర్కొన్నారు.ఈ సంఘటన లో వసుంధర తో పాటు ఆమె కొడుకు వంశీకి తీవ్రగాయాలు కావడం తో వారు కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.సింగరాయకొండ, బుంగబావి ఎస్టీ కాలనీలో యానాదులు నివసిస్తున్నారు. అదే ఎస్టీ కాలనీలోనే ముస్లీం కుటుంబాలు కొంతమంది నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా ఇరు వర్గాల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి.గతంలో కూడా ఆమని వసుందర పై దాడి జరిగిందని సింగరాయకొండ పోలీసు స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం దాడికి పాల్పడిన వారి కుటుంబం పై కేసు నమోదు జరిగింది.ఈ కేసును వాపసు తీసుకోమని, కేసు విషయం లో రాజీపడమని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా,దాడి చేసినవారితో డబ్బులు ఇప్పిస్తామని కూడా ప్రలోభపెట్టినా డబ్బు కంటే నాకు ఆత్మాభిమానం ముఖ్యమని కేసు వాపసు తీసుకోలేదని బాధితురాలు వివరించింది. గతంలో ఈమెకు అండగా నిలిచిన కొంతమంది సంఘాలవారిని డబ్బుతో లోబరచుకొని ఈమెతో రాజీ చేయించే భాద్యత అప్పచెప్పారు.అప్పటికీ వారిమాట కూడా వినకుండా నిజాయితీగా డబ్బుకు అమ్ముడుపోకుండా ఉన్న తన పై కక్షపెంచుకుని గతంలోదాడికి పాల్పడిన వారు
రాజీకి రావడం లేదని కక్ష పెంచుకొని దాడి హత్య యత్నానికి పథకం రచించారని దానిలో భాగంగానే ఆదివారం యానాదుల కులదైవం అయిన పోలేరమ్మ జాతర జరుపుకుని ఆనందంగా ఇంటికి వచ్చిన ఆమె ఒక్కరే ఇంట్లో ఉన్నారని గ్రహించి పధకం ప్రకారం ఇంట్లోకి 30 మందివచ్చి మారణాయుధాలతో దాడి చేశారని ఆమె వివరించింది. దాడిని తన కుమారుడు అడ్డుకోవడం తో తృటిలో ప్రాణాపాయం నుండి బయట పడ్డామని ఆమె తెలిపారు.తన కొడుకు తో పాటు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామన్నారు. ఈ సంఘటన పై సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. వసుందర ఇచ్చిన ఫిర్యాదు తో సింగరాయకొండ పోలీస్ లు క్రిమినల్ కేసు తో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీస్ లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆమని వంశి మరో ఇద్దరి పై కేసు నమోదు..
దర్యాప్తు చేపట్టిన పోలీస్ లు

సింగరాయకొండ బుంగ భావి సెంటర్ లో గ్రామ దేవత ఉత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన సంఘటన పై ఎస్ కె మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగరాయకొండ పోలీస్ లు కేసు నమోదు చేశారు. తమ నివాస ప్రాంతం లో చోటు చేసుకున్న వివాదం ఘర్షణ కి దారితీయడం తో మస్తాన్ తమపై జరిగిన దాడి గురించి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయడం తల నొప్పిగా మారింది. బాధితుని ఫిర్యాదు తో సింగరాయకొండ పోలీస్ లు ఆమని వంశి తో పాటు ఈ సంఘటన కి కారకులైన మరో ఇద్దరి పై కేసు నమోదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here