ఆర్టీసీ కి BOCI “ప్రవాస్ ఎక్సె లెన్స్” అవార్డు

0
4
RTC BOCI

ఆర్టీసీ తన అవార్డ్ ల అమ్ముల పొదిలో మరో నూతన అస్త్రాన్ని పొందు పరచుకుంది. శుక్రవారం బి ఓ సి ఐ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ హై-టెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగిన “ప్రవాస్ ఎక్సె లెన్స్ అవార్డ్స్” వేడుకలో ఫైనల్ నామినీగా “రెడ్ బస్ పీపుల్స్ ఛాయిస్ అవార్డు”కు ఎంపిక కాబడి, ఈ అవార్డు దక్కించుకుంది. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఈ వేడుకకు హాజరయి అవార్డును అందుకున్నారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆర్టీసీకి ప్రత్యేక ఆహ్వానం అందిన దరిమిలా ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు ఈ కార్యక్రమానికి హాజరై సభ్యుల హర్ష ద్వానాల మధ్య అవార్డును అందుకున్నారు. తొలుత ఆయన సాయంత్రం 4.౩౦నుంచి 5.౩౦ గంటల వరకు సాగిన రెగ్యులేటరీ రౌండ్ టేబుల్ డిస్కషన్ లో పాల్గొన్నారు. అనంతరం, ఎక్సిబిషన్ హాల్ లోని వివిధ వాహన తయారి కంపెనీలు అశోక్ లేలాండు, టాటా మోటార్స్, వాల్వో, అభి బస్సు, రెడ్ బస్సుల స్టాళ్ళ ను సందర్శించారు. ప్రవాస్ 3.0 యొక్క ముఖ్యమైన కార్యకలాపాలలో ఈ “ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫంక్షన్” ఘనమైనదిగా చెప్పుకోవచ్చు. బి ఓ సి ఐ అనేది అన్ని స్టేట్ ఫెడరేషన్‌ల యొక్క ప్రైవేట్ సెక్టార్ బస్ & కార్ ప్యాసింజర్ యొక్క అపెక్స్ ఆర్గనైజేషన్.
భారతదేశం అంతటా రవాణా ఆపరేటర్లు, ప్రయాణీకుల రవాణా విభాగాలను బి ఓ సి ఐ ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ, స్కూల్ బస్సు, ఉద్యోగుల రవాణా, టూర్ ఆపరేటర్లు, టూరిస్ట్ & మ్యాక్సీ క్యాబ్‌లు, తదితరాలు గా సూచిస్తుంది. ప్రవాస్ 3.0 బస్ అండ్ కార్ ఆపరేటర్ మరియు అనుబంధ రంగానికి చెందిన అన్ని వాటాదారులను ఒకే ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొట్ట మొదటిసారిగా, పబ్లిక్ & ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఇద్దరూ కలిసి పరస్పర సహకారం మెరుగైన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌లను అభివృద్ధి చేసే అవకాశాలను ఈ వేదిక వారధిగా అన్వేషిస్తారు. ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా నుండి 4000 మంది బస్, కార్ ఆపరేటర్లు, వ్యాపార సందర్శకులు, ఇతర వాటాదారుల సమ్మేళనం ఇక్కడ కనిపించింది.
బి ఓ సి ఐ నిర్వహించే 2-రోజుల ఈ వేడుకలో, వాటాదారులు ఈ రంగంలోని పలు సమస్యలను చర్చించడానికి, ఈ“ప్రవాస్3.0” ఏంతో ఉపయుక్తంగా, వారధిగా ఉండటం హర్షణీయ పరిణామమని వక్తలు అభిప్రాయ పడ్డారు. “సురక్షితమైన, స్మార్ట్, సస్టైనబుల్ ప్యాసింజర్ మొబిలిటీ” అనే కేంద్రం ఆలోచనతో బి ఓ సి ఐ నిర్వహిస్తోన్న ఈ 2-రోజుల యాక్షన్ ప్రోగ్రామ్లో , అందర్ని ఆకర్షించే విధంగా, నాణ్యమైన వాణిజ్యం, ప్రముఖ వ్యాపారం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన కీలక నిర్ణయాధికారులు మరియు వృత్తిపరమైన సందర్శకులతో కలిసి ఈ రంగం యొక్క అభివృద్ధి కోసం సరళీకృత మార్గాన్ని రూపొందించారు. సమగ్ర సమావేశం అనంతరం అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here