ఆర్డర్ పెడుతుంటే కస్టమర్లకు షాక్..

0
11

ఓ పుడ్‌కోర్ట్‌లో ఆర్డర్లు పెడుతుంటే ఫుడ్‌తో పాలు బల్లులు, బొద్దింకలు కూడా వస్తున్నాయి. దాంతో కస్టమర్లు బెంబెలెత్తిపోతున్నారు. మౌలి కాంప్లెక్స్‌లో ఉండే అనిల్ కుమార్ ఎలాంటే మాల్లో ని హావో రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. అయితే ఫ్రైడ్‌ రైస్ బొద్దింక కనిపించింది. దాంతో ఫ్రైడ్ రైస్‌ని ఫుడ్ కోర్టుకు తీసుకెళ్లి ప్రశ్నించగా.. అది బొద్దింక కాదు.. ఉల్లిపాయ అని చెప్పారు. దాంతో కస్టమర్‌కు కాలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చండీగఢ్‌లోని నెక్సస్ ఎలాంటే మాల్లో నుంచి ఆర్డర్ చేసిన భోజనంలో చనిపోయిన బొద్దింక కనిపించింది. దానిపై ఫిర్యాదు చేయగా.. రెస్టారెంట్ సిబ్బంది మాత్రం దానిని ఉల్లిపాయ అంటూ కొట్టిపారేశారు. మౌలి కాంప్లెక్స్‌లో ఉండే అనిల్ కుమార్ ఎలాంటే మాల్లో ని హావో రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఫ్రైడ్‌ రైస్‌లో బొద్దింక కనిపించడంతో షాక్ అయ్యానని అనిల్ అన్నారు. వెంటనే ఆ ఫ్రైడ్ రైస్ పట్టుకుని రెస్టారెంట్‌ సిబ్బంది దగ్గరకు తీసుకెళ్లగా.. అది బొద్దింక కాదు.. ఉల్లిపాయ అన్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

చివరికి కస్టమర్ అనిల్ ఖుమార్ పోలీసులకు కాల్ చేసి.. వెంటనే రెస్టారెంట్ సిబ్బందిపై చర్యలు తీసుకోమన్నారు. కానీ పోలీసులు ఆహారాన్ని ల్యాబ్‌కు పంపించాక, కలుషితమైనదని తేలాక మాత్రమే చర్యలు తీసుకోగలమని చెప్పారు. అయితే కస్టమర్ ఫిర్యాదుపై మాల్ ప్రతినిధి స్పందించారు అయాన్ పుడ్స్ నిర్వహిస్తోన్న ఫుడ్ కోర్టును తనిఖీలు చేయాలని యాజమాన్యం ఆదేశించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. తమ మాల్ ప్రాంగణంలో ఫుడ్ కోర్ట్‌లోని నిహావో కియోస్క్‌లో జరిగిన విచారకరమైన సంఘటన గురించి తాము తెలుసుకున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here