ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తాం : రజిని

0
3

 వైద్య శాఖలోని ఆసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. నరసరావుపేట, లింగంగుంట్లలో 200 పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎం జగన్ ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. వికేంద్రీకరణ పద్దతిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి స్థాయి సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని స్పష్టం చేశారు. ఏరియా ఆస్పత్రి నుంచి జిల్లా అసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 3254 ప్రోసీజర్స్‌కు ఆరోగ్య శ్రీ అమలు అయ్యేలా సిఎం ఆదేశాలిచ్చారన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పద్దతిని త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తామని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here