రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కందుకూరు మండల తహసిల్దార్ డి సీతారామయ్య కు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో PMGKY పథకం కింద అందాల్సిన ఉచిత బియ్యం పథకాన్ని గత నాలుగు నెలలుగా నిలిపివేశారని, ఇది ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. అన్నీ పదకాలకు రేషన్ కార్డు ప్రామాణీకముగా చేసిన జగన్ ప్రభుత్వము రకరకాల కారణాలు చూపించి రాష్ట్రము లో సుమారు 18.75 లక్షల రేషన్ కార్డులు తొలగించారు. రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకులో నాణ్యత అంతంతమాత్రంగా ఉందని , దేశంలోని అన్ని రాష్ట్రాలు ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేస్తూ ఆహార పద్ధతులకు పెద్దపీట వేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నాలుగు నెలలుగా ఈ పథకాన్ని నిలిపివేశారని . రాష్ట్రము లో 1.47 కోట్లు కార్డులోని 4.20 కోట్ల మంది సభ్యులు నాలుగు నెలలుగా ఉచిత బియ్యాన్ని నిలిపివేయడంతో 2940 కోట్లు విలువగల ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రజలు నష్టపోయారని విమర్శించారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పార్లమెంట్ పార్టీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు నాదెండ్ల వెంకట సుబ్బారావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధుబాబు, ఎస్. సి. సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, వాణిజ్య భాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను మాజీ కౌన్సిలర్స్ మహర్షి శ్రీను వడ్డేళ్ల రవిచంద్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు రెబ్బవరపు మాలాద్రి, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సలాం, తెలుగు యువత మండల అధ్యక్షులు రావుల రవి, పట్టణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మున్నా , ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు పులి నాగరాజు, తెలుగు యువత పార్లమెంటరీ కార్యదర్శి చుండూరు శ్రీను, వాణిజ్య విభాగం నియోజకవర్గం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఫిరోజ్ మనకే మాల్యాద్రి, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, భవనాసి వెంకటేశ్వర్లు, పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి బత్తిన ఆదెమ్మ, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, పొడపాటి ధనలక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు.