ఇంట్లో28 కోట్లు నగదు,బంగారం లభ్యం

0
11

పశ్చిమ బెంగాల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో భాగంగా ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రి పార్ధ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితాముఖర్జీకి సంబంధించిన మరో ఫ్లాట్‌లో మళ్లీ సోదాలు నిర్వహించగా.. రూ.28 కోట్ల డబ్బు, బంగారం స్వాధీనం లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఈడీ అధికారులు వెల్లడించారు. బంగారం ధర రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

అరెస్టైన పశ్చిమ బెంగాల్ పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో మరోసారి గుట్టలు గుట్టలుగా డబ్బు దొరికింది. ఆమెకు సంబంధించిన ఓ అపార్ట్‌మెంట్ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రూ. 27.90 కోట్ల నగదుతో పాటు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. బెల్గారియాలోని అపార్ట్‌మెంట్‌లో నగదును బుధవారం స్వాధీనం చేసుకున్నామని అధికారులు గురువారం ఉదయం తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

గత వారం ఈడీ అధికారులు దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలోని అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఫ్లాట్‌లో రూ. 21 కోట్లకు పైగా నగదు, నగలు, విదేశీ మారక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అప్పుడు నిర్వహించిన సోదాల్లో నగదుతో పాటు రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారం దొరికింది. పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ కేసులో భాగంగా ఈడీ అధికారులు అర్పితా ముఖర్జీ నివాసంపై మొదట దాడి చేశారు. రికవరీ చేసిన మొత్తం స్కామ్ ద్వారా వచ్చిన సొమ్ముగా అనుమానిస్తున్నారు.

అర్పితా ముఖర్జీ తన ఇంటి నుంచి రికవరీ చేసిన నగదును బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదని ఈడీ అధికారులకు తెలియజేశారు. తన ఇంట్లో ఒక రూమ్‌లో నగదును మొత్తం ఉంచారని, పార్థ ఛటర్జీ అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవారని చెప్పారు. అర్పిత స్టేట్‌మెంట్‌తో మంత్రి పార్థ ఛటర్జీని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన తన కుక్కల కోసమే ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్టు ఈడీ విచారణలో తేలింది. విచారణలో ఆయనకు సంబంధించిన అక్రమాస్తులు బయటపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here