కేసులు తక్షణం ఉపసంహరించు కోవాలి. _ ఏపియూడబ్ల్యూ జే డిమాండ్
రాష్ట్రం లో ఇటీవల జర్నలిస్టుల పై నమోదైన పోలీస్ కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ , ఇండియన్ జర్నలిస్ట్ లు డిమాండ్ చేశాయి..మేరకు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు,రాష్ట్ర అధ్యక్షడు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు
ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం న్యూస్ టుడే ( ఈనాడు,) విలేఖరి సోమేశ్వర రావు, అనంతపురం జిల్లా యాడికి ఆంధ్రజ్యోతి విలేఖరి కంచర్ల సంజీవ నాయుడు పై పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. ఓకే గదిలో రెండు, మూడు తరగతుల క్లాసులు నిర్వహిస్తున్న తీరు పై ఆ ఇద్దరు జర్నలిస్టుల ఫొటోస్ తో కదనాలు రాశారు. వీటిపై వివరణ ఇవ్వాల్సిన ఆ పాటశాల ల ప్రథానో పాద్యాయులు ఆ పని చేయక పోగా ఉపాధ్యాయుల విధులకు జర్నలిస్టు లు ఆటంకం కల్పించారని పోలీసులకు పిర్యాదు చేశారని తెలిపారు. ఆ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారని వారు తెలిపారు. పోలీస్ లు కూడా వెంటనే కేసులు నమోదు చేసి ఇద్దరు జర్నలిస్టులకు స్టేషన్ బెయిలు ఇచ్చారని తెలిపారు. ఈ విషయాలు తెలియగానే రెండు ప్రాంతాలలోని పోలీస్ అధికారులతో, విద్యాశాఖ అధికారులతో స్థానిక యూనియన్ నాయకులు మాట్లాడినట్లు తెలిపారు.
పూర్తి స్థాయిలో సేకరించిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల నుండి వచ్చిన వత్తిడి మేరకే హెచ్ ఎం లు జర్నలిస్ట్ లపై పిర్యాదు ఇవ్వగా, పోలీసులు వెంటనే కేసులు నమోదు చేసినట్లు apuwj నాయకులు వివరించారు…
. మీడియా స్వేచ్ఛను హరించే ప్రభుత్వ చర్యలలో భాగం గానే ఈ కేసులు నమోదు చేసినట్లు గా వారు ఆరోపించారు. కావున ప్రభుత్వం తక్షణం కేసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యూనియన్ అధ్వర్యంలో ఉద్యమించడం జరుగుతుందని హెచ్చరించారు.