ఇతర ప్రాంతాలకు విశాఖ ఉదాహరణ కావాలి

0
6
vizag

ఇక్కడి స్థాన బలం బాగుంది.. జనం సంకల్పం గొప్పది.
విశాఖ గొప్పదనం ఢిల్లీలో గౌరవంగా చెబుతారు.
ప్రమాదకర ప్లాస్టిక్ నుంచి రేపటి తరానికి మేలు సంకేతమవుదాం
జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ
విశాఖపట్నం స్థానబలం ఇక్కడి ప్రజా సంకల్పం గొప్పవని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఇక్కడి గొప్పదనం ఢిల్లీలో గౌరవంగా చెప్పుకుంటారని, ఇక్కడి స్థాన బలం ఎంత గొప్పదో జన సంకల్పం కూడా అంతే గొప్పదని ఆయన అభిలాషించారు. ప్రమాదకర ప్లాస్టిక్ నుంచి విశాఖ భవిష్యతరాలకు మంచి మేలు అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం ఇక్కడి సింధూర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ హరగోపాల్ నిర్మాతగా ప్రధాన పాత్రలో గీతా ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన డిటెక్టివ్ హరగోపాల్, అంతలో అనే లఘు చిత్రాల ప్రీమియర్ షోలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ విశాఖ స్థాన బలం బాగుందన్నారు. విశాఖ నగరం గొప్పతనాన్ని ఢిల్లీ స్థాయిలో అక్కడి వారు గొప్పగా గౌరవంగా మాట్లాడుతూంటారని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగే కార్యక్రమాలు మరెక్కడా జరగవని చెబుతూ, ఇక్కడి సంఖ్యకానీ, నాణ్యత కానీ, సంకల్పం కానీ గొప్పవన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎప్పటికీ పాటించాలని, ప్లాస్టిక్ ప్రమాదకరమన్న సంగతి అందరూ పాటించేలా చేయాలన్నారు. అత్యధిక ప్రజల్లో వచ్చిన మంచి మార్పు ఎప్పటికీ గర్వకారణంగా కొనసాగాలే చేయాలన్నారు. భావితరాలు బాగుండాలనే సంకల్పంతో ప్లాస్టిక్ రహితంగా విశాఖను కాపాడుకుందమన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం ఉందనే సమాచారం అందరికీ తెలిసేలా చేయడంతో పాటూ పాటించేలా చేద్దామని పిలుపునిచ్చారు. అన్ని నగరాల్లోనూ విశాఖపట్నం ప్లాస్టిక్ నిషేధంలోనూ క్లీన్ అండ్ గ్రీన్లోనూ ఎప్పటికీ ఉదాహరణగా చెప్పుకునేలా తీర్చిదిద్దుకుందామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గుడ్డ సంచీలను ఆవిష్కరించారు.అదే విధంగా డిటెక్టివ్ హరగోపాల్, అంతలో … రెండు ప్రీ ప్రోమోలను విడుదల చేశారు. గౌరవ అతిధిగా పాల్గొన్న జీవీఎంసీ పూర్వ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ కళాకారులు ప్రతిభావంతులన్నారు. గ్రేటర్ విశాఖ కమిషనర్ ఐఏఎస్ గా నగరానికి వచ్చిన మార్పులను ఆయన ఉదహరిస్తూ స్వయంగా కళాకారులు అయినందున డాక్టర్ జి. లక్ష్మీగా కళారంగాన్ని ప్రోత్సహించడంలో మంచి పాత్ర వహిస్తున్నారని చెప్పారు. హరగోపాల్ గీతా ప్రసాద్ ద్వయం చేసిన ప్రయత్నం విజయం కావాలని ఆశించారు. విశాఖ కళాకారుల ప్రతిభ తరగని ఆస్థిఅన్ని ఎందరికో స్ఫూర్తిదాయకం అని దాడి సత్యనారాయణ నియాడారు. జీవీఎంసీ కమిషనర్ నో ప్లాస్టిక్ అంటూ నినదించి చేస్తున్న ప్రయత్నంనూ సాధిస్తున్న సత్ఫలితాలనూ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభినందించడం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కౌ నియాడారు. ప్రియ అతిధిగా పాల్గొన్న సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులూ, జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ విశాఖ కళాకారులతో చిత్రీకరించిన రెండు లఘు చిత్రాలు విజయం సాధించాలన్నారు. గీతాప్రసాద్ దర్శకత్వం, డాక్టర్ హరగోపాల్ల ద్వయం ప్రయత్నం విశాఖ కళాకారుల ప్రతిభకు అద్దం కావాలని ఆశించారు. డాక్టర్ జి. లక్ష్మీశ వంటి ఐఏఎస్ అధికారి జీవీఎంసీ కవి కుషనర్ గా ఉండడం. ఆయన సృజనాత్మకతతో విశాఖ జాతీయ స్థాయిలో గుర్తింపుని పొందడం అభినందనీయం అన్నారు. ఇప్పటికే నో ప్లాస్టిక్ నినాదంలో 90 శాతం విజయం సాధించి దేశంకి ఆదర్శంగా నిలిచారని, మిగిలిన పది శాతం పాజిటివ్ ఫలితాలు సాధించడం ఎంతో దూరంలో లేదని ఆయన ఆశించారు. డాక్టర్ జి. లక్ష్మిగా వంటి మంచి అధికారి కమిషనర్ రావడం గొప్ప అభివృద్ధి సూచిక అని చెబుతూ గంట్ల శ్రీమబాబు మరిన్ని మంచి కార్డులనూ సొంత చేసుకునే దశలో విశాఖ లక్ష్మీ శా నేతృత్వంలో ముందుకు దూసుకుపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ హరగోపాల్, గీతా ప్రసాద్, కిశోర్, నాంచారయ్య, రవి తేజ, తదితరులు మాట్లాడారు. ఇదే వేదికపై ప్రారంభంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. తేలు వెంకట రమణ, శివజ్యోతి మూర్తి తదితరులు కార్యక్రమ నిర్వహణలో భాగం అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here