అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి ఇ.సుప్రజ కు ఎస్పీ గా పదోన్నతి
తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న ఈ సుప్రజ ఎస్పీగా పదోన్నతి లభించింది.
ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర పోలీసు విభాగం గురువారం ఇచ్చింది.
సుప్రజ 2010 బ్యాచ్ కు చెందిన పోలీస్ అధికారిని. తొలుత అనంతపూర్ జిల్లా గుంతకల్లు లో డీఎస్పీగా ఈమెకు పోస్టింగ్ ఇవ్వబడింది అనంతరం హైదరాబాద్ సిటీ డిఎస్పీగా బదిలీ అయ్యారు.
అటు పిమ్మట హైదరాబాదులోని క్రైమ్ విభాగానికి ఓఎస్డిగా పనిచేసి తరువాత విజిలెన్స్ అండ్ క్రైమ్ విభాగంలో ఇంచార్జ్ గా పనిచేశారు.
ఈమె చిత్తూరు అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ, 2020 ఫిబ్రవరి 19న తిరుపతి అడిషనల్ ఎస్పీగా నియమించబడ్డారు.
విధుల పట్ల అంకితభావం, ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించడంలో చొరవ, పోలీసు విభాగం ద్వారా ప్రజలకు తన వంతు బాధ్యతగా ఎంతో కొంత మంచి చేయాలన్న తపన, ఈమెకు ఎస్పీగా పదోన్నతిని తెచ్చిపెట్టింది.
సుప్రజ కు పదోన్నతి వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ మరియు ఇతర అధికారులు ఆమెకు అభినందనలు తెలియజేశారు