ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదల..

0
5

ఈఏపీసెట్ ఫలితాలను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

 ఏపీలో వరుసగా పరీక్షల ఫలితాలు వస్తున్నాయి. ఇదివరకే రాష్ట్రంలో టెన్త్ క్లాస్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడదలయ్యాయి. నేడు ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు. జూలై 26న ఉదయం 11 గంటలకు విజయవాడ లో మంత్రి బొత్స చేతుల మీదుగా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.  

ఈ ఏడాది ఈఏపీసెట్  2 లక్షల  82  వేల  496  మంది  పరీక్ష రాయగా, 2  లక్షల  56   వేల  983   మంది   క్వాలిఫై  అయ్యారని మంత్రి బొత్స తెలిపారు. ఇంజినీరింగ్ లో  89.12 శాతం  క్వాలిఫై  అయ్యారు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 87 వేల 744 మంది పరీక్షకు హాజరుకాగా 83 వేల 411 మంది క్వాలిఫై అయ్యారు.  95.06 శాతం అభ్యర్థులు అగ్రికల్చర్ విభాగంలో అర్హత సాధించినట్లు చెప్పారు. ఇంజినీరింగ్  విభాగంలో  1   లక్షా  48  వేల  283 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2 లక్షల 6 వేల 579 మంది దరఖాస్తు చేసుకోగా, 1 లక్షా 94 వేల 752 మంది పరీక్ష రాయగా 1 లక్షా 73 వేల 572 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి బొత్స తెలిపారు. 

రెండు వారాల్లోనే రిజల్ట్స్..
జూలై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఏపీలో ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ ఎగ్జామ్ జూలై 4 నుంచి 8వ తేదీ వరకు జరిగాయి. అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను 11, 12వ తేదీల్లో నిర్వహించారు. అయితే ఈఏపీసెట్ పూర్తయిన రెండు వారాల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఈ ఏడాది ఈఏపీ సెట్ కు మొత్తం 3,01,172 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2,82,496 మంది ఈఏపీసెట్ కు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,94,752 మంది, వ్యవసాయ కోర్సులో పరీక్షలకు 87,744 మంది హాజరయ్యారు. ఈఏపీ సెట్ ర్యాంకులతో ఇంజినీరింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలు పొందటానికి వీలుంటుంది. త్వరలోనే ఆయా విభాగాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.

కౌన్సెలింగ్‌ సమయంలో ఏపీ ఎంసెట్- 2022 ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, పదో తరగతి మార్కుల మెమో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రం, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లాంటి పత్రాలు అవసరం ఉంటుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here