ఈడీ విచారణకు మల్లికార్జున్‌ ఖర్గే

0
2
mallikarjun kharge

నేషనల్‌ హెరాల్డ్‌- యంగ్‌ ఇండియాకు చెందిన ఆస్తుల మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.ఇప్పటికీ హస్తం జాతీయ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను పలు దఫాలు విచారించింది ఈడీ. తాజాగా.. మరోమారు విచారణకు హాజరుకావాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గేకు సమన్లు పంపించింది. ఈ సమన్లపై రాజ్యసభలో కొద్దిసేపు కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉద్రిక్త వాతారవణ నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు.ఈ సందర్భంగా.. తాము చట్టాన్ని గౌరవిస్తామని తెలిపారు ఖర్గే. అనంతరం హెరాల్డ్‌ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆయన సమక్షంలోనే యంగ్‌ ఇండియా ఆఫీసులో మరోమారు సోదాలు నిర్వహించింది ఈడీ. అనంతరం ఖర్గే వాగ్మూలాన్ని నమోదు చేసింది. సుమారు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం కురిసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here