ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరయ్యారు. సోనియాతో పాటు ఈడీ కార్యాలయానికి రాహుల్, ప్రియాంకగాంధీ కూడా వచ్చారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా సోనియాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈనెల 21న తొలిసారిగా సోనియాను విచారించిన ఈడీ మూడు గంటల పాటు ప్రశ్నించింది. అందులో భాగంగా 28 ప్రశ్నలకు సోనియా గాంధీ సమాధానమిచ్చారు. మరోవైపు సోనియా ఈడీ విచారణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది.