పవర్ఫుల్, ఫోల్డబుల్ ఫోన్లు కూడా..
ఈనెలలో కొన్ని ఆసక్తికరమైన స్మార్ట్ఫోన్లు భారత్‌లో లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో నాలుగు మొబైళ్లు రానున్నాయి. ఇందులో రెండు సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్లు కూడా ఉన్నాయి. అలాగే మరిన్ని ఫోన్లు కూడా ఈ నెలలో విడుదల కానున్నాయి. అవేంటో చూడండి.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అన్ని రేంజ్‌ల్లో చాలా మొబైల్స్ లాంచ్ అయ్యాయి. దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా మొబైళ్లను మన దేశ మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆగస్టు వచ్చేసింది. ఈనెలలోనూ భారత్‌లో కొత్త మొబైళ్లు విడుదల కానున్నాయి. ముఖ్యంగా ప్రీమియమ్ రేంజ్లో ఆసక్తికరమైన ఫోన్లు రానున్నాయి. సామ్సంగ్, రియల్మీ, వన్‌ప్లస్, ఐకూతో పాటు మరిన్ని కంపెనీల నుంచి పోన్లు విడుదల కానున్నాయి. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ మొబైళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. సామ్సంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈనెలలో ఇండియాలో విడుదల కానున్న కీలకమైన మొబైల్స్ ఇవే.
ఐకూ 9టీ 5జీ
ఈనెల 2వ తేదీన ఐకూ 9టీ 5జీ లాంచ్ కానుంది. రూ.50వేలలోపు ధరతో క్వాల్కామ్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో లాంచ్ కానుంది. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఉండనుంది. డిస్ప్లే, కెమెరాలతో పాటు అని విభాగాల్లో ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లతో iQoo 9T 5G అడుగుపెట్టనుంది.
వన్‌ప్లస్ 10టీ 5జీ
వన్‌ప్లస్ నుంచి తాజా ఫ్లాగ్‌షిప్‌గా ఈ మొబైల్ రానుంది. వన్‌ప్లస్ 10టీ 5జీ ఈనెల 3వ తేదీ లాంచ్ కానుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఈ ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వస్తోంది. కెమెరాలు, డిస్ప్లేతో పాటు అన్ని విభాగాల్లో అదిరిపోయే స్పెసిఫికేషన్లతో రానుండగా..150వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు ఈ OnePlus 10T 5G సపోర్ట్ చేస్తుంది
సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4
సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఈనెల 10వ తేదీన జరగనుంది. ఈ ఈవెంట్లోనే రెండు ఫోల్డబుల్ మొబైళ్లను లాంచ్ చేయనుంది. సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను తీసుకురానుంది. ఈ రెండు మడత ఫోన్లు కూడా ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లతో రానున్నాయి. ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్స్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. మిగిలిన విభాగాల్లోనూ ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది.
వివో వీ25 సిరీస్
వివో వీ25 సిరీస్ మొబైళ్లు కూడా ఇదే నెలలో లాంచ్ కానున్నాయి. వివో వీ25, వివో వీ25 ప్రో ఫోన్లు ఈ సిరీస్‌లో అడుగుపెట్టనున్నాయి. డిజైన్, కెమెరాలే హైలైట్‌గా ఈ ఫోన్లు రానున్నాయి.
రియల్మీ జీటీ నియో 3టీ
స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో ఈనెలలోనే రియల్మీ జీటీ నియో 3టీ లాంచ్ కానుంది. 120Hz అమోలెడ్ డిస్ప్లేతో పాటు మంచి స్పెసిఫికేషన్లతో రూ.35వేల ధరలోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
షావోమీ 12 లైట్
గ్లోబల్‌గా ఇటీవలే లాంచ్ అయిన షావోమీ 12 లైట్ మొబైల్ ఈనెలలో భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ముఖ్యంగా తక్కువ బరువుతో డిజైన్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
పోకో ఎం5
షావోమీ సబ్‌బ్రాండ్ పోకో కూడా మరో బడ్జెట్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈనెలలోనే పోకో ఎం5 లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రూ.10వేల రేంజ్‌లోనే ధర ఉంటుంది.