ఈనెల 10తో ముగియనున్న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ పదవీకాలం

0
4

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడి పదవీకాలం ఈనెల 10తో ముగుస్తున్నందున ఆయనకు 8వ తేదీన వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరోజు సాయంత్రం 6.15 గంటలకు పార్లమెంటు ప్రాంగణంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సచివాలయం సోమవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎగువసభ సభ్యులతో గ్రూప్‌ ఫొటో కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. వెంకయ్యనాయుడి గౌరవార్థం సభ్యులకు రాత్రి విందు ఇవ్వనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here