ఈ వీడియో వెనుక పెద్ద కుట్ర ఉందని.. MP గోరంట్ల మాధవ్ స్పందించారు…..

0
7
  • మాజీ పోలీస్ అధికారి, వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ కొన్ని టీవీ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన ఒక మహిళతో మాట్లాడుతున్నట్టున్న వీడియో వైరల్ అవుతోంది.
  • ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ స్పందిస్తూ… ఈ వీడియో వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఇది మార్ఫింగ్ వీడియో అని అన్నారు. దీని వెనుక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు ఉన్నారని అన్నారు. ఈ వీడియోలో ఉన్నది తానే అని నిరూపిస్తే తన తల నరుక్కుని ఏబీఎన్ రాధాకృష్ణ కాళ్ల దగ్గర పెడతానని చెప్పారు. ఈ వీడియో తొలుత ఏబీఎన్లో ప్రసారమయిందని చెప్పారు.
  • ఈ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా ఎస్పీకి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ పంపాలని టెస్టుకు అన్నారు. . తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ఎంపీ గోరంట్ల తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here