68వ జాతీయ చలన చిత్ర పురస్కార వేడుకలో దక్షిణాది చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సత్తా చాటారు.
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డుల్లో దక్షిణాది సినిమాలు తమ సత్తా చాటాయి. 2020 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు శుక్రవారం అవార్డులను ప్రకటించారు. వీటిలో మొత్తం 400 సినిమాలు అవార్డుల కోసం పోటీలో నిలిచాయి. వీటిలో 15 ప్రాంతీయ భాషా చిత్రాలను అవార్డుల వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరిలో సుహాస్, చాందినీ చౌదరి నటించిన ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరరై పొట్రు’(ఆకాశమే నీ హద్దురా) సినిమా ఉత్తమ జాతీయ చిత్రంగా నిలిచింది.