-కింజరాపు అచ్చెన్నాయుడు.
జగన్ రెడ్డి అసమర్ధతకు ఆర్థిక శాఖ అధికారులు మూడేళ్ళుగా అద్దిన అందమైన అబద్ధం “సాంకేతిక సమస్య”.. దాదాపుగా ప్రతి నెలా జీతాలు ఆలస్యం అవుతాయి, ప్రతి నెలా సాంకేతిక సమస్య అని చెబుతారు.. అది నిజమే అయితే మూడేళ్ళుగా సాంకేతిక సమస్యలు పరిష్కరించ లేకపోవడం కూడా అసమర్థతే కదా? అయినా ఉద్యోగులు ఆ పదం వినీ వినీ అలసిపోయారు. ఇక నమ్మే పరిస్థితి లేదు. ఖజానా ఖాళీ అందుకే శ్రావణ శుక్రవారం పండుగ నాడు కూడా ఉద్యోగులకు జీతాలు అందక.. ఇళ్ళల్లో అక్క చెల్లెమ్మలు జగన్ రెడ్డి అసమర్థ పాలన దెబ్బ రుచి చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మొదటి తారీకున ఖచ్చితంగా జీతాలు పడేవి అని.. నెలవారీ ఖర్చులు ప్లాన్ ప్రకారం సాఫీగా సాగిపోయేవి అని, EMI లు ఆలస్యం కాకుండా చెల్లించేవారం అని.. ఈ ప్రభుత్వం వచ్చాక మొదటి తారీఖున జీతాలు రావడం గగనం అయిపోగా.. ఉద్యోగుల ఎకౌంట్ లలో పడ్డ సొమ్ము కూడా తిరిగి మాయమయిపోవడం సర్వ సాధారణం అయిపోయింది అనీ.. ఇంత చెత్త పాలన చరిత్రలో లేదనీ చెబుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేద్దామా అని ఎదురుచూస్తున్నారు.