ఊహించని విధంగా విద్యార్థుల నిరసన.. 

0
9

చదువుకున్న కాలేజీలోనే నడ్డాకు చేదు అనుభవం. గో బ్యాక్ అంటూ నినాదాలు

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఊహించని విధంగా విద్యార్థుల నుంచి నిరసన ఎదురైంది. తను చదువుకున్న పాట్నా కాలేజీకి వెళ్లిన ఆయనకు విద్యార్థులు నినాదాలు స్వాగతించారు. నడ్డా గో బ్యాక్ అంటూ నిరసన తెలియజేశారు. కొత్త జాతీయ విద్యావిధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రెండు రోజుల పాటు సాగే సమావేశాల కోసం నడ్డా అక్కడకు వెళ్లారు. ఆ సందర్భంగా తను చదువుకున్న కాలేజీకి వెళ్లారు. కానీ ఇలాంటి అనుభవం ఎదురైంది.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకి చేదు అనుభవం ఎదురైంది. అతను చదివిన కాలేజీలోనే ఆయనకు ఊహించని అవమానం జరిగింది. పాట్నా కాలేజీకి వెళ్లిన ఆయనకు విద్యార్థులు స్వాగతం పలకలేదు. పైగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యకర్తలు శనివారం నిరసన చేపట్టారు. 2020 జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, పాట్నా విశ్వవిద్యాలయానికి కేంద్ర హోదాను కూడా డిమాండ్ చేశారు. దాంతో వాపస్ జావో అంటూ నినదించారు.


బీజేపీకి చెందిన వివిధ విభాగాల రెండు రోజుల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశం బీహార్‌లో జరగనుంది. దీనికోసం అక్కడకు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆయన డిప్యూటీ సీఎంలు, కేబినెట్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నడ్డా పాట్నాలో రోడ్ షో కూడా నిర్వహించారు. అనంతరం తను చదవిన పాట్నా కాలేజీలోని సెమినార్‌కు ఆయన హాజరయ్యారు. అలా వెళ్లిన నడ్డాకు వ్యతిరేకంగా ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ నిరసన తెలిపింది. విద్యార్థులు నల్లా జెండాలతో గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే నడ్డాకు ఆ కాలేజీతో మంచి అనుబంధం ఉంది. అదే యూనివర్సిటీలో నడ్డా తండ్రి కూడా పని చేశారు.

అయితే నడ్డాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘం AISA విద్యార్థులను అడ్డుకునే ABVP కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆ గొడవను నివారించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here