ఎంత MP అయినా.. చట్టం ముందు సామాన్యుడివే…

0
2

పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ.. గోరంట్ల మాధవ్ దిక్కుమాలిన పని చేసి దొరికిపోవడమే కాక.. తెలుగుదేశం పార్టీ నేతలపై, మీడియాపై చిందులేసి, నిందలేయడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు గారు విమర్శించారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తికి నీతి, నిజాయితీ అనేవి లేవా.? ఒక ఎంపీకి సంబంధించిన ప్రైవేటు వీడియోకు, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎంటి సంబంధమో సమాధానం చెప్పాలి. ఒక పౌరుడిగా, కుటుంబంలోని వ్యక్తిగా, పార్లమెంటు సభ్యుడిగా నీ కుటుంబానికి, ఓట్లేసిన ప్రజలకు, దేశానికి సమాధానం చెప్పకపోవడం పోయి.. మీడియాను, తెదేపా నాయకులను విమర్శించడమేంటి.? నీవు తప్పు చేయలేదని చెప్తే సరిపోతుందా.? ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తానని చెబుతున్నపుడు.. ఆ పని చేయకుండా భయపడాల్సిన అవసరం ఏమిటి.?
ఆనాడు పార్లమెంటులో యత్ర నార్యస్తు పూజ్యంతే అని పెద్ద పెద్ద శ్లోకాలు పలికి నేడు నువ్వు చేస్తున్న పనికిమాలిన పని ఇదా?? మీ ఎంపీలు పార్లమెంటులో ఏపీ పరువు తీశారు. 25 ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని మీ నాయకుడు అంటే.. జనం నమ్మి సీట్లిస్తే.. మీరు చూపే ప్రత్యేక హోదా ఇదా.? ఇలాంటి న్యూడ్ వీడియోలేనా మీరు తెచ్చే స్పెషల్ స్టేటస్.? ఇదేనా సాధిస్తామన్న రైల్వే జోన్.? ఇవేనా వెనుకబడిన జిల్లాలకు తెస్తామన్న కేంద్ర నిధులు.?
ఇలా ఎన్నో సమస్యలుంటే.. కనీసం పోరాటం చేయకుండా. దిక్కుమాలిన పనులు చేస్తూ దరిద్రపు ఎంపీగా గుర్తింపు పొందారు. గతంలో కియా పరిశ్రమ ఎండీని బెదిరించారు. పార్లమెంటులో రఘురామ రాజు లాంటి ఎంపీపై దాడికి దిగారు. పార్లమెంటులో మీసాలు తిప్పి, తొడలు కొట్టి పరువు తీశావు.
పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించి, ప్రజలకు మేలు చేయడం కోసం నిన్ను ఎన్నుకుంటే.. నువ్వేం చేస్తున్నావ్.? తెలుగుదేశం పార్టీ ఎంపీలను చూసి నేర్చుకో. మూడేళ్లుగా ఏపీ సమస్యలపై అలుపెరుగకుండా గళమెత్తి పోరాటం చేస్తున్నారు. పార్లమెంటులో రాష్ట్రం కోసం పోరాటం చేయడం మాని, బట్టలన్నీ విప్పి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ.. తిరిగి మా పార్టీ నాయకులు మార్ఫింగ్ చేశామంటూ నిందలేస్తావా.? తెలుగు జాతి పరువును నాశనం చేసింది కాక.. పైగా గాంబీర్యాలు పలుకుతున్నావ్
ఇంత దౌర్భాగ్యమైన పనులు చేస్తూ తిరిగి విమర్శలు చేస్తావా.? ఇంత జరుగుతున్నా.. జగన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? ఫోరెన్సిక్ విచారణ చేయాలని మాధవ్ అడిగారు. ఆ మేరకు విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చి తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయండి.
మహిళలకు కనీస గౌరవం కూడా ఇవ్వకపోగా.. చనిపోయిన ఎన్టీఆర్ కుమార్తె మరణంపైనా నీచమైన రాజకీయం చేస్తున్నారు.ఇదేనా జగన్ రెడ్డీ నీ రాజకీయం.? ఇదేనా నీ విశ్వసనీయత.?
జగన్ రెడ్డిపై, రాష్ట్ర పోలీసులపై చాలా నమ్మకం ఉంది. అందుకే.. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతాం. తప్పు చేస్తే తల తీసేసుకుంటామని మాధవ్ మాటలు హాస్యాస్పదంగా ఉంది. ఒక ఎంపీగా ఉండి నీవు ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినపుడు.. సిగ్గుపడి బాధ్యతగా రాజీనామా చేసి, ఆ వీడియో నీది కాదు అని రుజువైన తర్వాతే పార్లమెంటుకు వస్తానని చెప్పాలి. అంతేగానీ.. మా పార్టీ నాయకులు చేశామంటూ మాపై నిందలు వేయడానికి కాస్తైనా సిగ్గు ఉండాలి.
వైసీపీ అనేది రాజకీయ పార్టీనో.. రాసలీలల పార్టీయో అర్ధం కావడం లేదు. నీవు చేసిన ఘన కార్యానికి జగన్ రెడ్డి ఇంకే పెద్ద పదవి ఇచ్చి నిన్ను సత్కరిస్తారో అని భయమేస్తోంది.
మాపై విమర్శలు చేసే ముందు నీవేంటో, నీ ఆత్మ సాక్షిని ప్రశ్నించుకో. నిజంగా నీవు సచ్చీలుడివే అయితే.. ముందు పదవికి రాజీనామా చేసి తప్పు చేయలేదని నిరూపణ అయ్యాక తిరిగి పార్లమెంటుకు వెళ్లాలి అని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here