ఎంపీ గోరంట్ల మాధవ్ పై మహిళలు ఆగ్రహం

0
2

వైసీపీ ప్రజాప్రతినిధుల వికృత చేష్టలకు నిరసనగా ఒంగోలు తెలుగు మహిళ, తెలుగు యువత, తెలుగు విద్యార్థి సంయుక్తంగా నగరంలోని అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్దనిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాధ్యతగల ప్రజా ప్రతినిధి అయి ఉండి నగ్నంగా వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని మహిళలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు లాంటి నేతల వ్యవహార శైలి పై ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకుని ఉంటే నేడు ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా ఉండేవని ముఖ్యమంత్రి వదిలేయడం వల్లనే ఇటువంటి చర్యలు ఫునరావృతం అవుతున్నాయి అని తక్షణమే ఇటువంటి నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేసి వారి యొక్క శాసనసభ,పార్లమెంటు స్థానాలకు రాజీనామా సమర్పించే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళలు వైసీపీ ప్రజాప్రతినిధుల ఫోటోలు ను చెప్పులతో కొట్టారు. ప్రజల ప్రతినిధుల ఫోటోలు తగలబెట్టుటకు ప్రయత్నించిన తెలుగు మహిళలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది . ఈ సందర్భంగా పలువురు నాయకులు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మగ పోలీసులు మహిళల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు మహిళ, తెలుగు యువత, తెలుగు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here