ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు..

0
6

చనిపోయినా సరే తగ్గేదే లేదు. శివసేనను వీడను : సంజయ్ రౌత్

ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి నిప్పులు చెరిగారు. ఎంత దాడి చేసినా తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. సంజయ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంతో తనదైన శైలీలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేనను వీడేది లేదని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తలొగ్గేది లేదని చెప్పారు. చనిపోయినా సరే పోరాడుతూనే ఉంటానన్నారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు. కానీ బీజేపీ మాత్రం తప్పు చేయలేనప్పుడు భయం ఎందుకని ప్రశ్నిస్తుంది.

శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆదివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. పాత్రచాల్ భూ కుంభకోణం కేసులో భాగంగా ఆయన నివాసంలో సోదాలు చేశారు. ఇప్పటికే ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. జూలై 27న ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన రాలేనని చెప్పారు

ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా ముంబైలోని రౌత్ ఇంటికి వెళ్లారు. అనంతరం అతనిని అధికారులు ప్రశ్నించారు. అయితే దీనిపై సంజయ్ రౌత్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ దురుద్దేశంతోనే తనపై దాడి జరిగిందని ఆరోపణలు చేశారు. ఇదే సందర్భంలో తాను ఎలాంటి స్థితిలోనూ శివసేనను వీడిదే లేదని స్పష్టం చేశారు.

“నాకు ఎలాంటి కుంభకుణంతో సంబంధం లేదని దివంగత బాలాసాహెబ్ థాక్రే‌పై ప్రమాణం చేస్తున్నాను.
నేను చనిపోతాను కానీ శివసేనను వీడను. నేనెవరికీ తలొగ్గను. బాలా సాహెబ్ మాకు ఎలా పోరాడాలో నేర్పించారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను. ” అని రౌత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. బీజేపీ మాత్రం తప్పు చేయనప్పుడు భయపడడం ఎందుకని ప్రశ్నిస్తోంది. ఈడీ విచారణకు ఎందుకు హాజరు కాలేదని ఆ పార్టీ నాయకులు అడుగుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఈడీ తనిఖీల నేపథ్యంలో సంజయ్ రౌత్ ఇంటి దగ్గరకు పెద్దసంఖ్యలో శివసేన కార్యకర్తలు చేరుకున్నారు. ఈడీ చర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా పాత్రచాల్ కుంభకోణంతో ఆయన సతీమణి వర్షా రౌత్ సహా మరికొందరి సన్నిహితులకు సంబంధం ఉందని ఈడీ ఆరోపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here