ఎన్టీఆర్ కుటుంబంపై నీచ ప్రచారమా….మీరు అసలు మనుషులేనా?

0
5
somireddy-chandramohan-reddy
  • విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతిల తీరుపై నిప్పులు చెరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
  • దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి సీబీఐ విచారణ వేయించుకోవాలని సవాల్
  • మహాపురుషులు ఎన్టీఆర్ కుమార్తె మరణించి ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్న పరిస్థితుల్లో విరోధులైనా ఒక్క నిమిషం బాధపడుతారు
  • కానీ విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతిలు మాత్రం మానవత్వం లేకుండా నీచంగా వ్యవహరిస్తున్నారు
  • నిజాలు మాట్లాడటాన్ని విజయసాయిరెడ్డి ఎప్పుడో మర్చిపోయారు. 16 నెలలు జైల్లో ఉన్న ఆయన అబద్ధాలు చెప్పడానికే పనికొస్తాడు
  • వేల కోట్లు ఆస్తులు పోగేసుకున్నావుగా విజయసాయిరెడ్డీ..ఇంకా ఎందుకు ఇలాంటి నీచాలకు పాల్పడుతున్నావ్
  • అప్పుడేమో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంటి పెరట్లో ఉందని కూశావ్..అసలు డైమండే లేదని నీ ధర్మారెడ్డే చెప్పాడు..ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి.
  • పులివెందులలో మీ జగన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డిని నరికి నరికి చంపారు.
  • మొదట హార్ట్ అటాక్ అని నువ్వే వీధి నాటకమేశావ్..ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంపించాడని పచ్చి అబద్ధాలు మాట్లాడావ్
  • ఇప్పుడేమో ఆ హత్య కేసు మీద అసలు సీఐబీ విచారణే వద్దని జగన్ రెడ్డే చెప్పుకుంటున్నాడు..ఆయన చెల్లెలు సునీత ఏమో సీబీఐ కావాలని డిమాండ్ చేస్తోంది
  • అసలు సమాజంలో ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారా..అనే బుద్ధి కూడా మీకు లేదా
  • మీలో ఒకరు ఇంకో కూత కూడా కూశారు..ఎన్టీఆర్ కుమార్తె మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని
  • మీకు దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీ వేయించుకోండి..రోజూ ఢిల్లీకి వెళ్లి అక్కడ కాళ్లు పట్టుకోవడం మీకు అలవాటే కదా..ఇఫ్పుడు కూడా కాళ్లు పట్టుకుని వేయించుకోండి
  • చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అడిగితే సీబీఐ విచారణ జరపరనే విషయం జ్ఞానం కూడా మీకు లేదా
  • రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే, కోర్టు మార్గదర్శకాలతోనూ సీబీఐ విచారణకు ఆదేశిస్తారు
  • లేదంటే కేంద్ర ప్రభుత్వ సంబంధిత అంశమైతే వేస్తారనే విషయకుండా నిత్యం సీబీఐ కోర్టుల చుట్టూ తిరిగే మీకు తెలియకుండా పోయిందా
  • లక్ష్మీపార్వతీ..అసలు మీరు మహిళేనా..ఒక ఆడపడుచుగా ప్రవర్తిస్తున్నావా…ఎందుకమ్మా ఇలా తయారైనావ్
  • ఎన్టీఆర్ కుటుంబంలో అడుగుపెట్టకముందు అసలు నీ బతుకేందమ్మా
  • నీ కొడుకు, నీ కోడలు, వారి పిల్లలు తాము లక్ష్మీపార్వతి కుటుంబసభ్యులమని చెప్పుకునేలా బతుకుమ్మా
  • మరీ అంత దిగజారిపోవద్దమ్మా..
  • మీరు నిజంగా మనుషులైతే మీరు చెప్పే ఆ సర్వే నంబర్లలో భూములను వెతుక్కొని సీబీఐ విచారణ వేయించుకోండి.
  • మీ ఇద్దరికి కొంచెం మానవత్వమున్నా శోకసంద్రంలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబానికి క్షమాపణ చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here