ఎన్టీఆర్ కుమార్తె అనుమానాస్పద మృతి..

0
10

టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలం నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉమా మహేశ్వరి తొలుత గుండెపోటుతో కన్నుమూసినట్టు ప్రచారం జరిగింది. కానీ, ప్రస్తుతం ఇది ఆత్మహత్య అని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ప్రాథమికంగా మాత్రం సూసైడ్‌గా నిర్దారణకు వచ్చారు.

  • ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు.
  • అనారోగ్య కారణాలతో ఉమా మహేశ్వరి బలవన్మరణం.

స్వర్గీయ ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (52) హఠాన్మరణం విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డినట్టు? భావిస్తున్నారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె అచేతనంగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కుటుంబసభ్యుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కేసును నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉమా మహేశ్వరిది ఆత్మహత్యగానే పోలీసులు భావిస్తున్నారు. మెడపై కూడా గాయాలున్నాయని చెబుతున్నారు. ఫ్యానుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

గత కొంతకాలంగా ఉమా మహేశ్వరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉమా మహేశ్వరి కుమార్తె దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతో తన తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు దీక్షిత తెలిపింది. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురిమే ఉన్నామని, లోపలి నుంచి గడియ పెట్టుకుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉమా మహేశ్వరి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నట్టు వివరించింది. భోజన సమయానికి బయటకు రాకపోవడంతో తలుపు తెరిచే ప్రయత్నం చేయగా లోపలి నుంచి బోల్టు పెట్టుకుని ఉందని దీక్షిత చెప్పారు.

తొలుత ఉమా మహేశ్వరిది గుండెపోటుగా భావించారు. కానీ, కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉమామహేశ్వరి గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురి అవుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. తాము 2.45 గంటలకు అక్కడకు చేరుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here